సుందర వనంగా బర్కత్‌పుర పార్కు
అంబర్‌పేట నియోజకవర్గంలో మునుపెన్నడు లేని విధంగా బర్కత్‌పుర హౌసింగ్‌బోర్డు పార్క్‌లో రూ.1 కోటి 80 లక్షలతో ఆధునీరకణ పనులు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ఆధ్వర్యంలో పూర్తయ్యాయి.
- పూర్త్రెన ఆధునీకరణ పనులు
- కనువిందు చేస్తున్న పార్క్‌లోని పచ్చని చెట్లు, వివిధ రకాల ఆట వస్తువులు
- హర్షం వ్యక్తం చేస్తున్న స్థానికులు
కాచిగూడ,సెప్టెంబర్ 4: అంబర్‌పేట నియోజకవర్గంలో మునుపెన్నడు లేని విధంగా బర్కత్‌పుర హౌసింగ్‌బోర్డు పార్క్‌లో రూ.1 కోటి 80 లక్షలతో ఆధునీరకణ పనులు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ఆధ్వర్యంలో పూర్తయ్యాయి. కాచిగూడ డివిజన్ బర్కత్‌పురలోని హౌసింగ్‌బోర్డు పార్కు చుట్టు పటిష్టమైన గ్రిల్స్‌ను నిర్మించి, ద్వారం వద్ద వివిధ రూపాల్లో ఆర్చ్ నిర్మాణం, పార్కులోకి వాకింగ్‌కు వచ్చే ప్రజలకు పచ్చని గడ్డితో వాకింగ్ ట్రాక్ రోడ్డు, పిల్లలు అడుకోవడానికి వివిధ రకాల ఆట వస్తువులు, వాకర్స్ సమావేశాలను నిర్వహించడానికి నూతన గదిని నిర్మించారు. అదే విధంగా ఆధునాతన జిమ్ పరికరాలను ఏర్పాటు చేశారు. ఇక్కడికి వచ్చే సందర్శకులు, వాకర్స్ కోసం పార్క్‌లోని గోడలపై వినూత్నమైన చిత్రాల వేయించి, 3వేల మొక్కలను పార్క్ చుట్టుపక్కల ఇరువైపుల నాటారు. ప్రజల సౌకర్యార్థం పార్క్‌లో ఓపెన్‌జిమ్ ఏర్పాటు, ఫుట్‌పాత్‌లపై బెంచీలను ఏర్పాటు చేయించారు. రాబోయే తరాలకు పచ్చదనాన్ని ఇవ్వడానికి నియోజకవర్గంలోని ప్రజలు తమవంతు బాధ్యతగా పార్కులను సంరక్షించుకోవాలని వాకర్స్ సూచించారు. పర్యావరణాన్ని రక్షించడం కోసం గత ప్రభుత్వాలు చేయలేని పనులను సీఎం కేసీఆర్ చేతల్లో చేసి చూపిస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండలాంటే కాలుష్య రహిత ప్రకృతిని అందించేందుకు పచ్చని చెట్లను కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
నియోజకవర్గ ప్రజల సహకారంతో అభివృద్ధి..
నియోజకవర్గ ప్రజల సహకారంతో పార్కుల అభివృద్ధే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నాం. గత పాలకుల నిర్లక్ష్యంతో నియోజకవర్గంలోని అనేక పార్కుల్లో వసతుల్లేక అందులోకి వెళ్లాలంటేనే భయపడేవారు. ప్రస్తుతం ఉదయం, సాయంత్రం వేళల్లో వాకింగ్‌కు వెళ్లడం, చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు కుటుంబ సభ్యులతో కలిసి ని ఆహ్లాదకరంగా సేద తీరుతున్నారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని నియోజకవర్గంలోని పార్కులన్నింటిని ఆధునికరిస్తాం.
-కాలేరు వెంకటేశ్, ఎమ్మెల్యే
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

