టప్పాచబుత్రా ఎస్ఐ మధు సస్పెన్షన్

కార్వాన్/ బేగంపేట్, జూలై 21: టప్పాచబుత్రా పోలీసు స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న ఉయ్యాల మధుపై సస్పెన్షన్ వేటు పడింది. ఉన్నతాధికారుల కథనం ప్రకారం.. టప్పాచబుత్రా పీఎస్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న ఉయ్యాల మధు గతంలో చిలకలగూడ పీఎస్లో పనిచేశాడు. ఆ సమయంలో ఓ వివాహిత మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. మధు ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి సంబంధం కొనసాగించాడు. ఇటీవల ఆమె పెళ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి తీసుకువచ్చింది. దీంతో వీరిద్దరి మధ్య కొద్ది రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఈనెల 15న ఆమె బేగంపేట పీఎస్ పరిధిలో ఆత్మహత్యకు యత్నించింది. దీంతో మధు వివాహేతర సంబంధం బయటపడింది. వివరాలు తెలుసుకున్న నగర పోలీసు కమిషనర్ అతడిపై సస్పెన్షన్ వేటు వేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు మంగళవారం బేగంపేట పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి, డీసీపీ(పశ్చిమ), టప్పాచబుత్రా పోలీసులకు సమాచారం ఇచ్చారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

