‘శ్రుతిలయ ఆర్ట్స్ సంస్థ ’ సభ్యుల సేవలు అభినందనీయం

రవీంద్రభారతి, సెప్టెంబర్ 3 : శ్రుతిలయ ఆర్ట్స్ అకాడమీ, సీల్వెల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం రవీంద్రభారతిలో శ్రుతిలయ ఆర్ట్స్ 20వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి, తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడు డాక్టర్ సముద్రాల వేణుగోపాలచారి, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దామోదర గుప్తా, పర్యాటక శాఖ చైర్మన్ శ్రీనివాస్ గుప్తా విచ్చేశారు. ఈ సందర్భంగా మధుసూదనాచారి మాట్లాడుతూ.. శ్రుతిలయ ఆర్డ్స్ సంస్థ అధ్యక్షురాలిగా గుడ్లు ధనలక్ష్మి బాధ్యతలు చేపట్టడం సంతోషదాయకం అన్నారు.
సంస్థ అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టి ప్రముఖలను సన్మానించడం అభినందనీయమన్నారు. 50 ఏండ్లలో మానవ సంబంధాల గురించి ఘంటశాల మాస్టారు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన మధుర గీతాలలో మానవీయ సంబంధాలున్నాయన్నారు. నిజంగా ఇలాంటి పాటలు ఇంటే మనసు ఉల్లాసంగా ఉంటుందన్నారు. ఇలాంటి గొప్పవాళ్లను సన్మానించడం ద్వారా సమాజానికి ఎంతో మేలు చేసినవారవుతారన్నారు. శ్రుతిలయ ఆర్డ్స్ అకాడమీ అధ్యక్షురాలిగా గుడ్ల ధనలక్ష్మి బాధ్యతలను స్వీకరించారు. నవరస గాయని ఆమని పాడిన పాటలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో సరస్వతి అవదాని దైవజ్ఞశర్మ, కళాపత్రిక సంపాదకులు మహ్మద్ రఫీ , యువకళావాహిని లంకా లక్ష్మీనారాయణ, బండారు సుబ్బారావు, రఘు, కుసుమ భోగరాజు, గాంధీ పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

