ఆంత్రప్రెన్యూయర్లకు మేథో సంపత్తే శ్రీరామరక్ష
వినూత్న ఆవిష్కరణలతో వచ్చే కొత్త ఆంత్రప్రెన్యూయర్లకు మేథోపరమైన సంపత్తి హక్కులే అత్యంత కీలకమని, పోటీ ప్రపంచంలో ప్రత్యేక ఉత్పత్తిగా గుర్తింపు రావడానికి ఇదే ముఖ్యమని పలువురు నిపుణులు అన్నారు.
- ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్‌పై ప్రత్యేక అవగాహన
- ‘సీసీఎంబీ – ఏఐసీ’ సదస్సులో పలువురు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు
సిటీబ్యూరో, జూలై 4(నమస్తే తెలంగాణ): వినూత్న ఆవిష్కరణలతో వచ్చే కొత్త ఆంత్రప్రెన్యూయర్లకు మేథోపరమైన సంపత్తి హక్కులే అత్యంత కీలకమని, పోటీ ప్రపంచంలో ప్రత్యేక ఉత్పత్తిగా గుర్తింపు రావడానికి ఇదే ముఖ్యమని పలువురు నిపుణులు అన్నారు. ‘సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యూలర్ బయాలజీ’లో జరిగిన ‘నేషనల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఫెస్టివల్’లో కాలేజీ విద్యార్థులు, యువ పారిశ్రామికవేత్తలతో ప్రత్యేక సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ఇన్నోవేషన్, ఆంత్రప్రెన్యూయర్షిప్లో ఐపీ ప్రాధాన్యతను వివరించారు.
లైఫ్ సైన్సెస్‌లో ఆధునిక ఆవిష్కరణలు
లైఫ్ సైన్సెస్ రంగంలో ఆధునిక ఆవిష్కరణలు పురుడు పోసుకుంటున్నాయి. అంకుర సంస్థలుగా తీర్చిదిద్దడంలో ఆలోచనలే ప్రధానం. ఆ ఆలోచనలను విజయవంతమైన ప్రాజెక్టులుగా మారేంత వరకు ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అండగా ఉంటాయి. అయితే, దశల వారీగా అభివృద్ధి చెందే ఆంత్రప్రెన్యూయర్ షిప్‌ను సమర్థవంతంగా నడిపించడంలో నాలుగు దశలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఇందులో ఆలోచనను కార్యక్రమంలోకి తీసుకువచ్చి సుస్థిర వ్యాపార సంస్థగా నిలిపేలా కార్యాచరణ ప్రధానమన్నారు.
ఇక వ్యాపార వృద్ధిని పెంచేలా ప్రణాళికలు, కొంతకాలం పాటు ఇండస్ట్రీలో నిలబడేలా భవిష్యత్తు లక్ష్యాలను నిర్దేశించుకోవాలని సీసీఎంబీ నిపుణులు పేర్కొన్నారు. అయితే, మేథో సంపత్తి హక్కులను పర్యవేక్షించుకునే క్రమంలో కాపీ రైట్, పేటెంట్, ట్రేడ్ మార్క్, డిజైన్ వంటి అంశాలపై లోతైన అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఈ సదస్సులో ఆయా అంశాల వారీగా ఐపీ ప్రాముఖ్యతను వివరిస్తూ సీసీఎంబీ వర్గాలు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించాయి.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- CCMB
- Sri Ramaraksha
RELATED ARTICLES
తాజా వార్తలు
కరువు ముప్పుపై సర్కారు నిర్లక్ష్యం : చాడ కిషన్‌రెడ్డి
మోరంపల్లిబంజర్‌లో ముమ్మరంగా పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
ధనవంతుడైన వ్యాపారవేత్తగా నటించి.. 20 మంది మహిళా కానిస్టేబుల్స్‌ను మోసగించిన వ్యక్తి
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

