సిటీబ్యూరో, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ) : ఔటర్ రింగు రోడ్డు వెంబడి 23 కిలోమీటర్ల పొడవునా నిర్మిస్తున్న సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్ పనులు వేగంగా సాగుతున్నాయి.
నానక్ రామ్ గూడ నుంచి తెలంగాణ పోలీస్ అకాడమీ వరకు 8.5 కిలోమీటర్లు, నార్సింగి నుంచి కొల్లూరు వరకు 14.5 కిలోమీటర్ల వరకు ట్రాక్ నిర్మిస్తున్నారు. సుమారు 16 మెగావాట్ల సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేయనున్న ఈ ప్రాజెక్టు పనులు గడువు లోగా పూర్తి చేయాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్.. అధికారులకు సూచించారు.