స్ట్రీట్‌లైట్ స్తంభం మీదపడి.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి
స్ట్రీట్ లైటింగ్ స్తంభం మీదపడి ఓ యువకుడు మృతిచెందాడు. ఈ సంఘటన నాచారం పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం ఉదయం తెల్లావారుజామున చోటుచేసుకుంది. పోలీసులు, స్థానకుల కథనం ప్రకారం నాచారం కార్తీకేయనగర్‌కు చెందిన సాత్విక్(23) సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు.
ఉప్పల్, సెప్టెంబర్ 2 : స్ట్రీట్ లైటింగ్ స్తంభం మీదపడి ఓ యువకుడు మృతిచెందాడు. ఈ సంఘటన నాచారం పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం ఉదయం తెల్లావారుజామున చోటుచేసుకుంది. పోలీసులు, స్థానకుల కథనం ప్రకారం నాచారం కార్తీకేయనగర్‌కు చెందిన సాత్విక్(23) సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. స్నేహితుడిని కలవడానికి వెళ్లి తెల్లవారుజామున ఇంటికి తిరిగి వస్తున్నాడు. ఈ క్రమంలో నాచారం ప్రధాన రహదారిలో ఈఎస్ఐ-నాచారం చౌరస్తా ప్రాంతంలో వినాయకుడి నిమజ్జన ఊరేగింపు నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలో వినాయకుడి ఊరేగింపులో పైభాగం కేబుల్ వైర్‌ను తగలడంతో దీనికి అనుబంధంగా ఉన్న స్ట్రీట్ లైటింగ్ స్తంభం, మరో స్తంభం విరిగిపడింది. ఇదే సమయంలో ద్విచక్రవాహనంపై వస్తున్న సాత్విక్ తలకు బలంగా తగిలింది. దీనితో సాత్విక్ మృతిచెందాడు. స్తంభం తుప్పుపట్టిన స్థితిలో ఉండటంతో విరిగిపోయినట్లు తెలుస్తున్నది. నిమజ్జనం వాహనం డ్రైవర్ ఏడుకొండలు, మండప నిర్వాహకుడు వెంకటేశ్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నోముల రిషితకు రూ.55 వేల ఆర్థిక సాయం
Singapore haze | సింగపూర్‌లో 15 రోజులుగా దట్టమైన పొగమంచు.. అనారోగ్యకర స్థాయిలో గాలి నాణ్యత..!
Jailer 2 | జైలర్ 2 క్లైమాక్స్ షూట్లో తలైవా టీంతో మోహన్ బాబు.. ట్రెండింగ్‌లో స్టిల్
Manipur Violence | మణిపూర్ హింసాకాండలో నలుగురు మృతి.. సీఎం నివాసం వద్ద మృతదేహాలతో నిరసన
AP Parishad Elections | ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 3న పోలింగ్
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

