హైదరాబాద్ : ఆరు అడుగుల పొడవున్న త్రాచుపామును రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ రాజీవ్ త్రివేది పట్టుకున్నారు. ఆ తర్వాత ఆ పామును అటవీశాఖ అధికారులకు అప్పగించారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కృష్ణయ్య హైదరాబాద్లోని ప్రశాసన్ నగర్లో నివాసం ఉంటున్నారు. అయితే కృష్ణయ్య ఇంటి ఆవరణలో ఆరు అడుగుల పొడవున్న త్రాచుపాము కనిపించింది.
దీంతో అదే కాలనీలో నివాసముంటున్న రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ రాజీవ్ త్రివేదికి సమాచారం అందించారు. రాజీవ్ త్రివేది కృష్ణయ్య ఇంటికి చేరుకుని, పామును పట్టుకున్నారు. అనంతరం ఆ పామును అటవీశాఖ అధికారులకు సమాచారం అందించి, పామును వారికి అప్పగించారు. పామును సురక్షితంగా అడవుల్లో వదిలేయాలని అధికారులకు రాజీవ్ త్రివేది సూచించారు.