రంగస్థలం టు సినీరంగం

మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా యంగ్ ఫిల్మ్ మేకర్స్ తమ ప్రతిభను చాటుకుంటున్నారు. సినిమాల్లోనే కాకుండా సామాజిక మాధ్యమాల్లో వీక్షించేలా లఘు చిత్రాలు రూపొందించి ఉన్నత అవకాశాలు దక్కించుకుంటున్నారు. అలా.. గ్రామీణ ప్రాంతంలోని యువతకు ఎదురయ్యే సమస్యల వల్ల వారి మధ్య వచ్చే గొడవలను ఎదుర్కొని.. ఒకరికి ఒకరు సహకరించుకొని ఎలా నడుచుకోవాలన్న కథాంశంతో విప్లవ్‌కుమార్ దర్శకత్వంలో తీసిన ‘ఊరుముచ్చట’ షార్ట్ ఫిలిం అందరి ప్రశంసలు అందుకుంటున్నది.
ఎవరీ విప్లవ్‌కుమార్..
సినిమాల్లో రాణించాలని విప్లవ్‌కుమార్ చిన్నప్పటి నుంచి కలలు కన్నారు. కుటుంబ పరిస్థితులు.. తనను ఊరు వదిలి రానియ్యలేదు. డీఎడ్ పూర్తిచేసి కొంతకాలం ప్రైవేటు స్కూల్లో టీచర్‌గా పనిచేశారు. చెల్లెళ్ల పెండ్లి చేయాలని అమ్మానాన్నతో కలిసి ముంబైకి వలసపోయారు. కష్టపడి పనిచేసి తన నలుగురు చెల్లెళ్లలో ఇద్దరి వివాహాలు చేశారు. ఓ వైపు కుటుంబ బాధ్యతలు.. మరో వైపు సినిమారంగంపై ఆసక్తి.. ఊర్లో ఉండనీయలేదు. ఏదో ఒకటి తేల్చుకుందామని పట్నం వచ్చారు. వచ్చిన అవకాశాలను ఉపయోగించుకొని ఓ వైపు టీవీ సీరియళ్లు, సినిమాల్లో నటుడిగా రాణిస్తూనే ఊరు ముచ్చట షార్ట్ ఫిలిం తీసి.. విప్లవ్‌కుమార్ అందరి దృష్టిని తన వైపు తిప్పుకోగలిగారు. కొత్తదనం కోసం చూసే వారిని మెప్పించేలా ఈ లఘు చిత్రాన్ని రూపొందించి జనం మెప్పు పొందిన విప్లవ్‌కుమార్ ప్రస్థానం ఆయన మాటల్లోనే..
తక్కువ బడ్జెట్‌తో..
రవీంద్రభారతిలో శిక్షణ పొందుతున్న సమయంలో భాషా సాంస్కృతిక శాఖ తరఫున నిర్వహించిన 4 గంటల షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్‌లో నవభారతం పేరుతో నేను దర్శకత్వం వహించిన లఘు చిత్రానికి రెండో బెస్ట్ షార్ట్ ఫిలిం అవార్డు దక్కింది. ఇతరులు రూపొందించిన కొన్నింట్లో నటించాను. ఆ తర్వాత యూట్యూబ్ కోసం రూపొందించిన పాటలకు దర్శకత్వం వహించాను. తక్కువ బడ్జెట్‌తో తీసిన ఊరు ముచ్చట లఘు చిత్రానికి అత్యంత ఆదరణ దక్కడం నాకు ఎక్కడలేని ఆనందం కలిగించింది.
ఊరు నుంచి..
నారాయణపేట జిల్లాలోని మారుమూల గ్రామం అభంగాపూర్ మాది. అమ్మ మల్లమ్మ, నాన్న గోవిందు ఇద్దరూ వ్యవసాయ కూలీలే. నా అసలు పేరు రాము… ఆర్.నారాయణమూర్తి సినిమాలంటే చాలా పిచ్చి… అందుకే నా పేరును విప్లవ్కుమార్గా మార్చుకున్నా.. నాకు నలుగురు చెల్లెళ్లు.. కుటుంబ బాధ్యతలు నాపైనే ఉన్నా… చిన్నప్పటి సినిమా రంగంపై విపరీతమైన ఆసక్తి. కష్టపడి ఇద్దరు చెల్లెళ్ల వివాహం చేశాం. మిగిలిన ఇద్దరు చదువుకుంటున్నారు. సినిమా రంగంలో నన్ను నేను నిరూపించుకోవాలని ఊరు నుంచి హైదరాబాద్ వచ్చాను. అదే సమయంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ గతేడాది నిర్వహించిన 60 రోజుల మలేషియన్ మల్టీ లింగ్వల్ థియేటర్ వర్క్‌షాప్‌లో నటుడిగా రంగస్థలంపై నా ప్రయాణం ప్రారంభించాను. రవీంద్రభారతిలో ఈ రంగంలో శిక్షణ పొందడం నా అదృష్టం. అదే నా జీవితాన్ని మరో మలుపు తిప్పింది. తక్కువ సమయంలో నాకు ప్రత్యేక గుర్తింపు రావడానికి ఈ శిక్షణ ఎంతో ఉపయోగపడింది.
అందరి ప్రోత్సాహంతో..
మహారాష్ట్ర వెళ్లి పనిచేస్తున్న సమయంలో కూడా కథలు, మాటలు, పాటలు రాయడం, పాడటం చేసే వాడిని. ఆ అలవాటే నన్ను సినిమాలు, సీరియళ్ల వైపు వచ్చేలా చేసింది. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, మా కుటుంబ సభ్యులు, స్నేహితులు, పలువురు ప్రముఖుల ప్రోత్సాహంతోనే నాకు అవకాశాలు వస్తున్నాయి. ప్రేక్షక ఆదరణ ఉన్న బంధం, గోరింటాకు, స్వాతిచినుకులు ఇప్పుడు వస్తున్న అలా వెంకటాపూరం ఇతర సీరియళ్లలో ఆయా పాత్రల్లో నటించేందుకు అవకాశం దక్కింది. అంతేకాకుండా కేజీఎఫ్-2 సినిమాలో నటిస్తున్నా… ఇతర సినిమాల్లో కూడా చాన్సులు వస్తున్నాయి.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- short films
RELATED ARTICLES
తాజా వార్తలు
Manne krishank | కుంభకోణాలు చేయడం వల్లే రూ.50 వేల కోట్లు దోచుకున్నారు : మన్నె క్రిశాంక్
Symbiosis Professor: మాజీ విద్యార్థినికి అనుచిత మెసేజ్‌లు పంపిన సింబయాసిస్ ప్రొఫెసర్
Manne krishank | మీ పాత్ర లేకపోతే సీబీఐ విచారణ చేపట్టండి.. సీఎం రేవంత్‌కు మన్నె క్రిశాంక్ సవాల్
LK Advani: మెరుగుపడిన ఆరోగ్యం.. ఆస్పత్రి నుంచి ఎల్కే అద్వానీ డిశ్చార్జ్
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

