పేదింట్లో కల్యాణ కాంతులు
అప్పట్లో ఆడబిడ్డ పెండ్లి చేయాలంటే నిరుపేద తల్లిదండ్రులు ఎంతగానో ఇబ్బందిపడేవారు. అప్పులు చేసి బిడ్డను అత్తగారింటికి సాగనంపే పరిస్థితులు ఉండేవి. బిడ్డ పెండ్లి కోసం ఉన్న ఆస్తులు అమ్ముకునే పరిస్థితి ఆనాటిది.
- షాదీముబారక్,కల్యాణ లక్ష్మి పథకాలతో పేదలకు లబ్ధి
- సికింద్రాబాద్లో 8078 లబ్ధిదారులకు చెక్కులు అందజేత
సికింద్రాబాద్,నవంబర్8: అప్పట్లో ఆడబిడ్డ పెండ్లి చేయాలంటే నిరుపేద తల్లిదండ్రులు ఎంతగానో ఇబ్బందిపడేవారు. అప్పులు చేసి బిడ్డను అత్తగారింటికి సాగనంపే పరిస్థితులు ఉండేవి. బిడ్డ పెండ్లి కోసం ఉన్న ఆస్తులు అమ్ముకునే పరిస్థితి ఆనాటిది. కానీ తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం రావడంతో ముఖ్యమంత్రిగా అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలిచారు. అందులో భాగంగానే ఆడబిడ్డల పెండ్లి తల్లిదండ్రులకు భారం కాకూడదని.. అదొక సంబురంగా నిలవాలనే ఉద్దేశంతో తానే తండ్రిలా ఆలోచించి దేశంలో ఎక్కడా లేని విధంగా కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను తీసుకొచ్చారు. ఆడబిడ్డ పెండ్లి కోసం ఒక లక్షా పదహారు వేల రూపాయలు అందించి నిరుపేదల తల్లిదండ్రులకు చేయూతనిచ్చారు. ఈ పథకాలతో చాలా మంది తల్లిదండ్రులు లబ్ది పొందారు. ఇలాంటి పథకాలను సీఎం కేసీఆర్ తీసుకురావడంపై అందరూ ప్రశంసిస్తున్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో వందలాది మంది ఈ పథకాలతో లబ్ధి పొందారు. ఈ సారి కూడా కేసీఆర్ను మరోసారి గెలిపించుకుంటామని లబ్ధిదారులు తెలుపు తున్నారు. పేదోళ్ల గురించి ఆలోచించే ఏకైక ముఖ్యమంత్రి కేసీఆరేనని చెబుతున్నారు.
ఇంటింటికీ సంక్షేమ పథకాలు…
ప్రజలు ఉపకరించేలా ప్రభుత్వ కార్యక్రమాలు, పేదలకు తమ పిల్లల పెళ్లిళ్లు చేయడం భారంగా మారిన నేపథ్యంలో బీ ఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం ప్రవేశపెట్టిన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పేదలకు వరంగా మారాయి.
- సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో ఈ పథకాలు సద్వినియోగం అయ్యేలా డిప్యూటీ స్పీకర్, స్థానిక ఎమ్మెల్యే తీగుళ్ల పద్మారావు గౌడ్ జరిపిన ఏర్పాట్లు సత్ఫలితాలను అందిస్తున్నాయి.
- సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని మారేడుపల్లి, ముషీరాబాద్ మండలాల పరిధుల్లో ఈ పథకాన్ని ఐదేళ్ల కాలంలో 4051 మంది సద్వినియోగం చేసుకున్నారు. వారిలో అడ్డగుట్ట నుంచి 1049, తార్నాక లో 866, బౌద్ధనగర్లో 878, మెట్టుగూడలో 342, సీతాఫల్మండిలో 892లు ఉన్నారు.
- లబ్ధిదారులకు చెకులు మంజూరైన వెంటనే తానే అధికారులు, నాయకులతో కలిసి వారి ఇళ్లకు వెళ్లి లబ్ధిదారులకు చెకులను అందించే పద్ధతిని పద్మారావు గౌడ్ తొలి నుంచి పాటిస్తున్నారు. ఎవరికీ చిల్లి గవ్వ చెల్లించాల్సిన అవసరం లేకుండా దళారీల ప్రమేయాన్ని నివారించ గలిగారు.
సీఎం సారు మా బాధను తీర్చాడు
సీఎం సారు మా బాధను తీర్చాడు. బిడ్డ పెండ్లి ఎలా చేయాలో అని బాధపడ్డాం. మా ఇంటి సమీపంలోని బీఆర్ఎస్ నాయకుడిని సాయం కోసం అర్జించాం. కల్యాణ లక్ష్మి అండగా ఉందని ఆ పథకం గురించి చెప్పారు. వెంటనే దరఖాస్తు చేసుకున్నాం. లక్షా పదహారు వేల రూపాయలు ప్రభుత్వం మా బిడ్డ పెండ్లికి ఇచ్చింది.
-దీపకళ,లబ్ధిదారు
ప్రభుత్వానికి రుణపడి ఉంటాం
మంచి పనులు చేసిన మన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటికి పెద్ద కొడుకులా సమస్యలు పరిష్కరిస్తున్నాడు. సీఎం కేసీఆర్ కల్యాణ లక్ష్మి పథకం ప్రవేశపెట్టాలనే ఆలోచన చేయడం చాలా గొప్ప విషయం. ఆడ బిడ్డల పెండ్లి గురించి కూడా సీఎం ఆలోచించి మాకు లబ్ధి జరిగేలా పథకం తీసుకురావడం చాలా సంతోషంగా ఉంది. ఈసారి కూడా మళ్లీ సీఎం కేసీఆరే రావాలి.సారు రుణపడి ఉంటాం.
-రమ,లబ్ధిదారు
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

