సిటీబ్యూరో, ఫిబ్రవరి 3(నమస్తే తెలంగాణ): ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీకి చెందిన సీనియర్ సైంటిస్ట్ గంగాగ్ని రావు వాస్విక్ అవార్డును అందుకున్నారు. పర్యావరణ రంగంలో ఆయన చేసిన పరిశోధనలకు గాను ఈ అవార్డును సొంతం చేసుకోగా, ప్రొ. ఎంఎం శర్మ, ప్రొ. మషేల్కర్ చేతుల మీదుగా పురస్కారం తీసుకున్నారు.
ముంబైలో జరిగిన ఈ అవార్డుల వేదికలో పాల్గొని అరుదైన పురస్కారాన్ని పొందారు. కాగా, ఆయన ప్రతిష్టాత్మకమైన అవార్డును గంగాగ్ని రావు దక్కించుకోవడంపై ఐఐసీటీ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. ప్రస్తుతం ఐఐసీటీలో చీఫ్ సైంటిస్ట్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.