Sarvabhasha Kavi Sammelan | రిపబ్లిక్ డే సందర్భంగా ఆకాశవాణిలో ‘సర్వభాషా కవి సమ్మేళనం’
Sarvabhasha Kavi Sammelan 2024 | రిపబ్లిక్ డే సందర్భంగా ప్రతి ఏటా భారతీయ భాషల కవులను ఎంపికచేసే సర్వభాషా కవి సమ్మేళనాన్ని ఆల్ ఇండియా రేడియోకు చెందిన ఆకాశవాణి నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది కూడా రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా ఆకాశవాణి హైదరాబాద్ సర్వభాషా కవి సమ్మేళనం నిర్వహించనుంది.
Sarvabhasha Kavi Sammelan 2024 | రిపబ్లిక్ డే సందర్భంగా ప్రతి ఏటా భారతీయ భాషల కవులను ఎంపికచేసే సర్వభాషా కవి సమ్మేళనాన్ని ఆల్ ఇండియా రేడియోకు చెందిన ఆకాశవాణి నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది కూడా రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా ఆకాశవాణి హైదరాబాద్ సర్వభాషా కవి సమ్మేళనం నిర్వహించనుంది. ఈ సమ్మేళనం జనవరి 25, 2024 గురువారం రాత్రి 10 గంటల నుంచి ప్రసారం కానున్నట్లు ప్రకటించింది.
ఇక ఈ కార్యక్రమంలో జనవరి 5న రాంచీలో నిర్వహించిన ఆకాశవాణి సర్వ భాషా కవి సమ్మేళనంలో పాల్గొన్న 22 భాషల కవుల కవితలను తెలుగులోకి అనువాదం చేయించి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రూపొందించిన ‘సర్వభాషా కవి సమ్మేళనం’ ద్వారా తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారం చేయనునన్నట్లు వెల్లడించింది. ఈసారి సర్వ భాషా కవి సమ్మేళనంలో పాల్గొన్న నిజామాబాద్‌కు చెందిన తెలుగు కవి డాక్టర్ మల్లెగోడ గంగా ప్రసాద్ గారి ‘వెలసి జీవి’ కవితతో పాటు వివిధ భాషల చెందిన కవితలకు అనువాదాలు ఈ కార్యక్రమంలో ప్రసారం అవుతాయి.
డాక్టర్ దేవూరి అనంత పద్మనాభరావు, డాక్టర్. ఎస్. గోపాలకృష్ణ, డాక్టర్ సి. మృణాళిని, డాక్టర్ జీ.వి. సర్నాకర్ డాక్టర్ మంగారి రాజేందర్ డాక్టరీ ఏనుగు నరసింహారెడ్డి డాక్టర్ అమరవాది నీరజ అజయ్ వర్మ అల్లూరి, అస్కార సూర్యప్రకాష్, ముకుంద రామారావు, సుమనస్పతి రెడ్డి రాజులపల్లి ప్రతాపరెడ్డి, కుప్పిలి పద్మ మహ బలీస్ దర్భశయనం శ్రీనివాసదార్య, సి.ఎస్. రాజబాబు రావికంటి శ్రీనివాస్ యశస్వీ సతీష్, దేశరాజు, యీన్సీ కొప్పిశెట్టి, గీతా వెల్లండి, సందకిషోర్, వివిధ భాషల కవితలకు తెలుగు అనువాదాలు చేశారు. ఆకాశవాణి స్టూడియోలో ఇటీవల జరిగిన కార్యక్రమంలో వీరంతా తమ తమ అనువాద కవితలు చదివారు. ఈ సర్వభాషా కవి సమ్మేళనాన్ని ఆకాశవాణి జనవరి 25 గురువారం రాత్రి 10 గంటలకు ప్రసారం చేయనుంది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

