Sabitha Indra Reddy | పెద్దమ్మ అలయ నిర్మాణానికి సహకరిస్తా : సబితా ఇంద్రారెడ్డి
Sabitha Indra Reddy | ముదిరాజ్‌ల సంక్షేమానికి కృషి చేస్తానని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి(Sabitha Indra Reddy )తెలిపారు.
కందుకూరు, జనవరి 29 : ముదిరాజ్‌ల సంక్షేమానికి కృషి చేస్తానని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి(Sabitha Indra Reddy )తెలిపారు. పెద్దమ్మ తల్లి దేవాలయానికి(Peddamma temple) స్థలం కేటాయించి నిర్మాణం కోసం సహకరిస్తానని చెప్పారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల పరిధిలోని కొత్తగూడ గ్రామానికి చెందిన ముదిరాజ్‌లు గ్రామంలో పెద్దమ్మ దేవాలయం నిర్మాణం కోసం భూమి కేటాయించాలని కోరుతూ.. బుధవారం ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేవాలయం నిర్మించడానికి తన పూర్తి సహకారం ఉంటుందని చెప్పారు. అధికారులతో మాట్లాడి ప్రభుత్వ స్థలం కేటాయిస్తానని చెప్పారు. ముదిరాజ్‌లను అన్ని విధాలుగా ఆదుకోవడానికి కృషి చేస్తానని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో సామ ప్రకాశ్‌రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల సోషల్ మీడియ కన్వీనర్ బొక్క దీక్షిత్‌రెడ్డి, ముదిరాజ్ సంఘం అద్యక్షుడు పిట్టల శేఖర్ ముదిరాజ్, నర్సిహ ముదిరాజ్, మాదయ్య ముదిరాజ్, సత్తయ్య ముదిరాజ్, సత్యనారాయణ ముదిరాజ్, శేఖర్ ముదిరాజ్, నరేందర్ ముదిరాజ్, సురేశ్ ముదిరాజ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు బొక్క వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

