Sewage problems | మురుగు నీటి సమస్యల పరిష్కారం కోసం రూ.9కోట్లు
ఖైరతాబాద్ నియోజకవర్గంలో మురుగునీటి సమస్యలు పరిష్కారం కోసం రూ.9కోట్ల నిధులు మంజూరయ్యాయని ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు.
బంజారాహిల్స్ : ఖైరతాబాద్ నియోజకవర్గంలో మురుగునీటి సమస్యలు పరిష్కారం కోసం రూ.9కోట్ల నిధులు మంజూరయ్యాయని ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. నియోజకవర్గంలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, వెంకటేశ్వరకాలనీ, సోమాజిగూడ. ఖైరతాబాద్. హిమాయత్‌నగర్ డివిజన్ల పరిధిలోని బస్తీలు, కాలనీల్లో జలమండలి ఆధ్వర్యంలో చేపట్టాల్సిన అభివృద్ది పనులపై బుధవారం ఎమ్మెల్యే దానం నాగేందర్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
జలమండలి డివిజన్ -6 జీఎం హరిశంకర్, డీజీఎం శ్రీనివాస్, జూబ్లీహిల్స్ సెక్షన్ వాటర్ వర్క్ మేనేజర్ శ్రీహరి, తట్టిఖానా సెక్షన్ మేనేజర్ రాంబాబు, ఫిలింనగర్ సెక్షన్ మేనేజర్ పవన్, బంజారాహిల్స్ సెక్షన్ మేనేజర్ మేనేజర్ శివ తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో డివిజన్ల వారీగా చేపట్టాల్సిన అభివృద్దిపనులపై చర్చించారు.
జలమండలి ఆద్వర్యంలో చేపట్టాల్సిన పనులకు మంత్రి కేటీఆర్ చొరవతో రూ.9కోట్లు నిధులు మంజూరయ్యాయన్నారు. ఖైరతాబాద్ డివిజన్‌కు రూ.1.65 కోట్లు, వెంకటేశ్వరకాలనీ డివిజన్‌కు రూ.1.20కోట్లు, బంజారాహిల్స్ డివిజన్‌కు రూ.1.27కోట్లు, జూబ్లీహిల్స్ డివిజన్‌కు రూ.1.30 కోట్లు, సోమాజిగూడ డివిజన్‌కు రూ.2.1కోట్లు, హిమాయత్‌నగర్ డివిజన్‌కు రూ.60లక్షల నిధులు మంజూరయ్యాయని వెల్లడించారు.
ప్రశాసన్‌నగర్ నుంచి తట్టిఖానా సెక్షన్ దాకా గ్రావిటీతో మంచినీటిని తరలించేందుకు చేపట్టిన పైప్లైన్పనుల్లో మిగిలిపోయిన పను లను వెంటనే ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే దానం నాగేందర్ జలమండలి అధికారులను కోరారు. మూడేళ్ల క్రితమే ఈ ప్రాజెక్టులో 70శాతం పనులు పూర్తయ్యాయని, బంజారాహిల్స్ రోడ్ నెం 12 దాకా పైప్‌లైన్ నిర్మాణం పూర్తయిందని అధికారులు తెలిపారు.
కళింగభవన్ చౌరస్తానుంచి తట్టిఖానా సెక్షన్ దాకా పైప్‌లైన్ పనులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ఈ పనులు పూర్తయితే తట్టిఖానా సెక్షన్‌కు గ్రావిటీ ద్వారా ప్రశాసన్‌నగర్ రిజర్వాయర్ నుంచి నీటిని తరలించవచ్చని ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

