Revanth Reddy’s comments | సీఎం కేసీఆర్ మీద రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు సిగ్గుచేటు : ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్
సొంతపార్టీ నేతను ఉద్ధేశించి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తే గాంధీభవన్‌లో ముసుగువేసుకుని పడుకున్న పీసీపీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అందరికంటే ముందుగా బీజేపీ ముఖ్యమంత్రి వ్యాఖ్యలను ఖండించిన సీఎం కేసీఆర్ మీద అవాకులు చెవాకులు పేలడం సిగ్గుచేటు అని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
బంజారాహిల్స్ : సొంతపార్టీ నేతను ఉద్ధేశించి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తే గాంధీభవన్‌లో ముసుగువేసుకుని పడుకున్న పీసీపీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అందరికంటే ముందుగా బీజేపీ ముఖ్యమంత్రి వ్యాఖ్యలను ఖండించిన సీఎం కేసీఆర్ మీద అవాకులు చెవాకులు పేలడం సిగ్గుచేటు అని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను ఖైరతాబాద్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో దగ్దం చేశారు. బంజారాహిల్స్‌లో క్యాన్సర్ ఆస్పత్రి చౌరస్తావద్ద భారీ ఎత్తున టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దగ్దం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యేదానం నాగేందర్ మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్‌వన్‌గా మార్చిన సీఎం కేసీఆర్ జన్మదినవేడుకలను పండుగలా జరుపుకోవాలని తామందరం నిర్ణయించుకున్నామని, ఎన్నిరోజులు నిర్ణయించుకోవాలనే చెప్పడానికి రేవంత్‌రెడ్డి ఎవడని ప్రశ్నించారు.
సంస్కారాన్ని మర్చిపోయి వ్యాఖ్యలు చేస్తున్న రేవంత్‌రెడ్డిని ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ బొంతు రాంమోహన్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రసన్న రామ్మూర్తి. కార్పొరేటర్లు వనం సంగీతయాదవ్, కవితారెడ్డి, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు రాములు చౌహాన్, షేక్ అహ్మద్, అరుణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

