‘రెమిడెసివిర్’పై టాస్క్‌ఫోర్స్ నిఘా

- విస్తృతంగా పోలీసుల దాడులు
- ఏడుగురు అరెస్ట్.. 32 ఇంజక్షన్లు స్వాధీనం
సిటీబ్యూరో, మే 15(నమస్తే తెలంగాణ): రెమిడెసివిర్ ఇంజక్షన్‌ను బ్లాక్‌లో విక్రయిస్తున్న వారిపై హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిఘాను పటిష్టం చేశారు. శనివారం ఒక్కరోజే నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ నాగేశ్వర్రావు బృందం నాలుగు చోట్ల దాడులు నిర్వహించి.. ఏడుగురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి 32 రెమిడెసివిర్ ఇంజక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. మెడికల్ దుకాణాలు, మెడికల్ విభాగంలో పనిచేసే కొందరు రూ.3500 విలువ ఉన్న ఒక్కో ఇంజక్షన్‌ను బ్లాక్‌లో రూ. 35 వేల వరకు విక్రయిస్తున్నారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఎస్ఆర్నగర్, బంజారాహిల్స్, పంజాగుట్ట పోలీస్స్టేషన్ల పరిధిలో దాడులు చేసి..ఏడుగురురిని అదుపులో తీసుకున్నారు.
- ఎస్ఆర్నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఎల్లారెడ్డిగూడలో కొవిడ్‌కు అత్యవసర వస్తువులను సరఫరా చేసే ఏజెంట్ సుంకు దామోదర్, మార్కెటింగ్ ఏజెంట్ పుట్ట రామలింగేశ్లు బ్లాక్‌లో రెమిడెసివిర్ విక్రయిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకుని.. వారి నుంచి 17 ఇంజక్షన్లను స్వాధీనం చేసుకున్నారు.
- ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాకు చెందిన గిరీష్ కుమార్ బంజారాహిల్స్‌లోని ఓ దవాఖానలో ఎండోస్కోపి టెక్నీషియన్‌గా పనిచేస్తూ.. ఇంజక్షన్లను బ్లాక్‌లో విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. అతడి నుంచి ఆరు ఇంజక్షన్లను స్వాధీనం చేసుకున్నారు.
- ఏపీకి చెందిన గ్రంధి గౌరీశంకర్ కూకట్‌పల్లిలో నివాసముంటూ, నిమ్స్ వద్ద మందుల దుకాణం నిర్వహిస్తున్నాడు. అతని కొడుకు హరీశ్ కుమార్, యూసుఫ్‌గూడకు చెందిన పొత్నూర్ ముకుందరావులు కలిసి రెమిడెసివిర్ ఇంజక్షన్లను బ్లాక్‌లో విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ ముగ్గురిని అరెస్ట్ చేసి.. వారి నుంచి 6 ఇంజక్షన్లను స్వాధీనం చేసుకున్నారు.
- అలాగే కర్నూల్‌కు చెందిన అరకంటి చిన్న ఖైరతాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తూ..ఇంజక్షన్లను బ్లాక్‌లో విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకుని.. అతని నుంచి మూడు ఇంజక్షన్లను స్వాధీనం చేసుకున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- Remdesivir injection
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

