సిటీబ్యూరో, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ) : వాయుగుండం ప్రభావంతో రెండురోజులుగా నగరంలో వర్షాలు కురుస్తున్నాయి. గ్రేటర్లో సోమవారం పలు చోట్ల మోస్తరు వాన పడింది.
రాగల మూడు రోజులు అనేక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశమున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.