మెరుగైన వసతులపై దృష్టి పెట్టండి..
పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మెరుగైన వసతులు కల్పించడంపై అధికారులు దృష్టి సారించాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. బుధవారం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్న మంచినీటి వ్యవస్థ, ఎస్ఎన్డీపీ ఆధ్వర్యంలో చేపడుతున్న వరదనీటి నాలాల అభివృద్ధి, విద్యుత్, తదితర సమస్యలపై మేయర్ కొలన్ నీలాగోపాల్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
- ఎస్ఎన్డీపీ నాలా పనులను త్వరితగతిన పూర్తి చేయాలి..
- వేగవంతంగా బస్తీలు, కాలనీల్లో పైపులైన్ వ్యవస్థను చేపట్టండి..
- నిజాంపేట్ కార్పొరేషన్ సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే వివేకానంద్
దుండిగల్, డిసెంబర్ 28 : పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మెరుగైన వసతులు కల్పించడంపై అధికారులు దృష్టి సారించాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. బుధవారం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్న మంచినీటి వ్యవస్థ, ఎస్ఎన్డీపీ ఆధ్వర్యంలో చేపడుతున్న వరదనీటి నాలాల అభివృద్ధి, విద్యుత్, తదితర సమస్యలపై మేయర్ కొలన్ నీలాగోపాల్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వర్షాకాలంలో ముంపు ప్రాంతా ల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎస్ఎన్డీపీ నాలా పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, అదే విధంగా రాబోయే ఎండా కాలాన్ని దృష్టిలో ఉంచుకుని బస్తీలు, కాలనీల్లో పైపులైన్ వ్యవస్థను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. ఆయా ప్రాంతాల్లో నెలకొన్న విద్యుత్, ఇతర సమస్యలను గుర్తించి యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించా రు. ఈ సమావేశంలో కమిషనర్ వంశీకృష్ణ, డిప్యూటీ మేయర్ ధన్‌రాజ్, కార్పొరేటర్లు, ఎస్ఎన్డీపీ, హెచ్ఎండీఏ, హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ (జలమండలి), మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
మౌలిక సదుపాయాలకు పెద్దపీట..
బీఆర్ఎస్ ప్రభుత్వం మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేస్తూ ముందుకు సాగుతున్నదని ఎమ్మెల్యే వివేకానంద్ అన్నారు. బుధవారం నిజాంపేట్ కార్పొరేషన్ పరిధి, 23వ వార్డులోని మదర్ థెరిస్సా పార్కును మేయర్ కొలన్ నీలాగోపాల్‌రెడ్డి, డిప్యూటీ మేయర్ ధన్‌రాజ్‌తో కలిసి ఎమ్మెల్యే సందర్శించారు. పార్కులో జరుగుతున్న వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్, చిల్డ్రన్స్ ప్లే స్పేస్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో నిధుల లేమి లేకుండా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, త్వరితగతిన పనులు పూర్తిచేసి పార్కును ప్రజలకు అందుబాటులోకి తేవాలని సంబంధిత కాంట్రా క్టర్, అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, కో-ఆప్షన్ సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

