హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో (HCU) దారుణం చోటుచేసుకున్నది. విదేశీ విద్యార్థినిపై ప్రొఫెసర్ లైంగికదాడికి యత్నించాడు. థాయిలాండ్‌కి చెందిన విద్యార్థిని హెచ్‌సీయూలోని హిందీ డిపార్ట్మెంట్లో చదువుతున్నది. ఒంటరిగా ఉన్న ఆమెపై ప్రొఫెసర్ రవిరంజన్.. లైంగికదాడికి యత్నించాడు.
అయితే అక్కడి నుంచి తప్పించుకున్న బాధితురాలు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనతో వర్సిటీలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. బాధితురాలికి న్యాయం చేయాలని విద్యార్థి సంఘాలు ధర్నాకు దిగాయి.