చెరువుల సందరీకరణ

- పర్యాటక ప్రాంతంగా మారబోతున్న మీర్‌పేట పెద్ద చెరువు
- రూ.7 కోట్లతో పనులకు ప్రణాళికలు సిద్ధం
- 11న పెద్ద చెరువు సుందరీకరణ పనులకు మంత్రి శంకుస్థాపన
- కొనసాగుతున్న అల్లా చెరువు సుందరీకరణ పనులు
కుత్బుల్లాపూర్/బడంగ్‌పేట, ఆగస్టు9: బడంగ్‌పేట పరిధిలోని మీర్‌పేట పెద్ద చెరువు పర్యాటక ప్రాంతంగా మారబోతోంది. అదేవిధంగా జీడిమెట్ల డివిజన్ పరిధిలోని అల్లా చెరువు సుందరీకరణ పనులు జోరుగా సాగుతున్నాయి. మీర్‌పేట పెద్ద చెరువును మీనీ ట్యాంక్ బండ్‌గా అభివృద్ధి చేయాలని, అందుకు సంబంధించిన మ్యాప్‌ను అధికారులు రూపొందించారు. చెరువు సుందరీకరణకు సుమారు 12.89 ఎకరాల స్థలం కేటాయించారు. ప్రభుతం హెచ్ఎండీఏ నుంచి రూ.7 కోట్లు కేటాయించింది. అందుకు సంబంధించిన టెండర్ ప్రక్రియ పూర్తి చేశారు. ఈనెల 11న పెద్ద చెరువు సుందరీకరణ పనులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. అల్లా చెరువును అందంగా తీర్చిదిద్దేందుకు సుమారు రూ.80 లక్షలతో పనులు సాగుతున్నాయి. ఇప్పటికే చెరువు పూడిక తీత,ప్రహరీ,గ్రీన్ జాలీల ఏర్పాటుతో పాటు గతంలో మాదిరిగా డ్రైనేజీ లైన్‌ను ఇందులో నుంచి కాకుండా దాన్ని దారి మళ్లించి కేవలం రేయిన్ వాటర్ వాటర్ లైన్‌ను చెరువుకు లింక్ చేసే పనిలో నిమగ్నమయ్యారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- ponds development
RELATED ARTICLES
తాజా వార్తలు
బాలికపై రోబో లైంగిక వేధింపులు!
యూత్ కాంగ్రెస్‌కు షాక్.. బీఆర్ఎస్లోకి దుడ్డు ఆకాశ్
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

