మీ లొకేషన్‌కే తీసుకొస్తాం.. వెబ్సైట్లో ప్రకటనలు

- పోలీసుల డెకాయ్ ఆపరేషన్..
- వ్యభిచార నిర్వాహకుడు అరెస్ట్
జస్ట్ మీ లొకేషన్‌ను వాట్సాప్‌లో పెట్టండి… అమ్మాయిలతో మీ ముందు ఉం టాం.. ఇది ఇప్పుడు తాజా వ్యభిచార నిర్వాహకుల హైటెక్ సర్వీస్. ఈ సేవల గురించి ఓ వెబ్సైట్లో పెట్టడంతో రాచకొండ ఎస్ఓటీ పోలీసులు డెకాయ్ ఆపరేషన్ చేపట్టి ఇద్దరు యువతులను కాపాడి నిర్వాహకుడిని అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్, కృష్ణా జిల్లా కనికిపాడు మండలం, ఎడుపుగుల్ల గ్రామానికి చెందిన వంశీకృష్ణ ఎస్ఆర్నగర్లో నివాసం ఉంటున్నాడు. ఇటీవల ఓ వెబ్సైట్లో మా వద్ద కాల్‌గర్ల్స్ ఉన్నారని, వారు ఉత్తరాది, దక్షిణాది రాష్ర్టాలకు చెందిన యువతులు, మహిళలు అని ప్రకటన వేసి.. అవసరం ఉన్నవారు సంప్రదించాలని అతడు తన ఫోన్ నంబర్ ఇచ్చాడు. కేవలం మీ లొకేషన్ పంపిస్తే.. మీ వద్దకే యువతులను తీసుకువస్తానని పెట్టాడు. ఈ ప్రకటనను పరిశీలించిన పోలీసులు డెకాయ్ ఆపరేషన్ నిర్వహించి నిర్వాహకుడికి ఫోన్ చేశారు. అతను లొకేషన్ పంపించండి.. అమ్మాయిలను తీసుకువస్తామని చెప్పాడు. దీంతో కుషాయిగూడ ప్రాంతం లొకేషన్ ఇచ్చిన పోలీసులు.. వంశీకృష్ణ అసోం, పశ్చిమ బెంగాల్ ప్రాంతానికి చెందిన యువతులను తీసుకువచ్చాడు. వెంటనే పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వంశీకృష్ణను అరెస్ట్‌చేసి.. యువతులను పునరావాస కేంద్రానికి పంపించారు. ఈ వెబ్‌సైట్‌ను తిలకించే వారిని ఆకట్టుకునేందుకు యువతుల అర్ధనగ్న ఫొటోలు పెట్టి దందాను జోరుగా నడిపిస్తున్నారని పోలీసులు గుర్తించారు. ఈ ఆపరేషన్‌ను మల్కాజిగిరి ఎస్ఓటీ, కుషాయిగూడ పోలీసులు సంయుక్తంగా చేపట్టి అక్రమ దందాను బయటపెట్టారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

