86 మంది బైండోవర్
హైదరాబాద్‌లో శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా, ముఠా తగాదాలతో అశాంతి రేపుతున్న అసాంఘిక శక్తులపై నగర పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ సీరియస్ అయ్యారు. శనివారం నగరంలోని పది ప్రధాన ముఠాలకు చెందిన సభ్యులను టీజీఐసీసీసీకి పిలిపించి అదనపు జిల్లా మెజిస్ట్రేట్ (ఎగ్జిక్యూటివ్) హోదాలో ప్రత్యేక కోర్టు నిర్వహించారు. కమిషనరేట్ పరిధిలోని సౌత్, సౌత్ఈస్ట్, సౌత్‌వెస్ట్ పరిధిల్లో ఆధిపత్య పోరు కోసం ఘర్షణ పడుతున్న వారిపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు.
- అదనపు మెజిస్ట్రేట్‌గా కేసులు విచారించిన సీపీ సజ్జనార్
- శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఊరుకోబోమని హెచ్చరిక
సిటీబ్యూరో, నవంబర్ 29(నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లో శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా, ముఠా తగాదాలతో అశాంతి రేపుతున్న అసాంఘిక శక్తులపై నగర పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ సీరియస్ అయ్యారు. శనివారం నగరంలోని పది ప్రధాన ముఠాలకు చెందిన సభ్యులను టీజీఐసీసీసీకి పిలిపించి అదనపు జిల్లా మెజిస్ట్రేట్ (ఎగ్జిక్యూటివ్) హోదాలో ప్రత్యేక కోర్టు నిర్వహించారు. కమిషనరేట్ పరిధిలోని సౌత్, సౌత్ఈస్ట్, సౌత్‌వెస్ట్ పరిధిల్లో ఆధిపత్య పోరు కోసం ఘర్షణ పడుతున్న వారిపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు.
హత్యలు, హత్యాయత్నాలకు పాల్పడుతూ ప్రత్యర్థి ముఠాలపై దాడులకు తెగబడుతున వారిని పోలీస్ కమిషనర్ విచారించారు. బీఎన్ఎస్ సెక్షన్ 126కింద 86 మందిని కమిషనర్ బైండోవర్ చేశారు. రాబోయే ఏడాది కాలం పాటు ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడబోమని, సత్ప్రవర్తనతో ఉంటామని వారి చేత సెక్యూరిటీ బాండ్లు రాయించుకున్నారు. ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే, ఉపేక్షించేది లేదని, వారిపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నగరంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని సజ్జనార్ తెలిపారు. ఈ విచారణలో స్పెషల్ బ్రాంచ్ డీసీపీ కె.అపూర్వారావు, సంబంధిత ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

