న్యుమోనియా నుంచి కాపాడేందుకు వ్యాక్సిన్

సిటీబ్యూరో, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): చిన్నారులను న్యుమోనియా నుంచి రక్షించే న్యుమోకొకల్ వ్యాక్సిన్‌ను ప్రభుత్వ వైద్యశాలల్లో ఉచితంగా ఇవ్వనున్నారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో తొలుత ప్రారంభిస్తున్నట్లు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ జె. వెంకటి తెలిపారు. సోమవారం నిర్వహించిన టాస్క్‌ఫోర్స్ సమావేశంలో చిన్నపిల్లల ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన పలు అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్ వెంకటి మాట్లాడుతూ న్యుమోనియా నుంచి చిన్నారులను కాపాడేందుకు న్యుమోకొకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. దీంతో ఈ టీకాను సార్వత్రిక వ్యాధి నిరోధక టీకాల జాబితాలో చేర్చినట్లు తెలిపారు. ఈ వ్యాక్సిన్‌ను చిన్నారులకు 6 వారాల వయసులో మొదటి, 14 వారాల వయసులో రెండు, 9 నెలలప్పుడు మూడో డోసు వేయాల్సి ఉంటుందని అన్నారు. ప్రైవేట్‌లో ఈ టీకా ఖరీదు రూ.3 వేల వరకు ఉంటుందని తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- pneumonia vaccine
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆరు నెలల్లోనే రేవంత్ మార్ ఆర్థిక వినాశనం
శభాష్ వంశిక.. జాతీయస్థాయి క్రికెట్‌కు ఎంపికైన విద్యార్థినిని అభినందించిన కేటీఆర్
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

