కరోనా విజేతలూ.. ప్లాస్మా దానం చేయండి

మొదటి దశలో 6వేల మంది.. రెండో దశలో 1400 మంది దానం
విషమ పరిస్థితుల నుంచి బయటపడ్డ 12,400 మంది రోగులు
ప్లాస్మా దానానికి కొవిడ్‌ను జయించిన వారు ముందుకు రావాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులతో పాటు దాదాపు 60 మంది వలంటీర్లు ప్లాస్మా దానం చేసేవారిని, ప్లాస్మా అవసరం ఉన్నవారిని సమన్వయ పరుస్తూ.. విషమ పరిస్థితుల్లో ఉన్నవారిని కాపాడుతున్నారు. ఎస్సీఎస్సీ వలంటీర్లు, యంగీస్థాన్, రాబిన్‌హూడ్ ఆర్మీ, ఐ ఫోకస్, ఐ ఫౌండేషన్, వందేమాతరం యువజన సంఘం, సెయింట్ జోసెఫ్ కాలేజీ విద్యార్థులు, కోఠి ఉమెన్స్ కాలేజీ, యూత్ ఫర్ సేవా సంస్థలకు చెందిన వలంటీర్లు ముందుకు రావడం చాలా సంతోషంగా ఉందని సీపీ అన్నా రు. సైబరాబాద్ కొవిడ్ కంట్రోల్ రూం-9490617440 ద్వారా లేదా donateplasma. scsc.inలో ప్లాస్మా ఇచ్చేవారు, ప్లాస్మా కావాల్సిన వారు పేరు నమోదు చేసుకోవచ్చని సీపీ వివరించారు. గత ఏడాది అందరి సహకారంతో ఈ కంట్రోల్ రూం, ఎస్సీఎస్సీ, వలంటీర్ల ద్వారా దాదాపు 6 వేల మంది ప్లాస్మా దానం చేయగా.. 10 వేల మం దికి ఉపయోగపడిందన్నారు. రెండో దశలో 1400 మంది ప్లాస్మా దానం చేయగా, 2400 మంది బాధితులు అనారోగ్యం నుంచి బయటపడ్డారని తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- Plasma Donation
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

