ప్లాస్మాదానం చేయాలనుకుంటే ఇంటి వద్దకే కారొస్తుంది

మన్సూరాబాద్, మే 10 : కరోనాను జయించిన వారు ప్లాస్మాదానం చేయడానికి ఉచితంగా రవాణా సౌకర్యం కల్పిస్తామని..ఇంటి నుంచి దవాఖానకు, తిరిగి ఇంటికి చేర్చేందుకు ఐదు కార్లను సిద్ధంగా ఉంచినట్లు సామాజిక కార్యకర్త దోసపాటి రాము తెలిపారు. నిరుడు లాక్డౌన్లో జీవనోపాధి కోల్పోయిన ఎంతోమంది నిరుపేదలకు సామాజిక కార్యకర్త దోసపాటి రాము నాగోల్ డివిజన్ రాక్హిల్స్ కాలనీలో నెలకొల్పిన రైస్ ఏటీఎం ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. కరోనా విరుచుకపడుతుండడంతో చాలామంది ప్లాస్మా ఇవ్వాలని ఉన్నా సొంతంగా వాహనం లేకపోవడం, ఒకవేళ ఉన్నా ట్రాఫిక్ గజిబిజితో ముందుకురావడం లేదు. ఇలాంటి వారికోసం ఐదు వాహనాలను సిద్ధం చేశారు. ప్లాస్మాదానం చేయదల్చుకున్న వారు 9000998877 నంబర్‌కు ఫోన్ చేస్తే వాలంటీర్లు మీ ఇంటి వద్దకు వస్తారని ఆయన చెప్పారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- Plasma Donation
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

