ఒకరికి ఒకరై తోడుంటే… కరోనాను జయించవచ్చు

- విషమ పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్న వారికి ప్లాస్మా ఇవ్వండి
- మేం చేసిన దానం సంతృప్తినిచ్చింది..
- నగరవాసులకు ప్లాస్మాదాతల సూచన
- కరోనా సెకండ్ వేవ్ వేగంగా వ్యాపిస్తుండటంతో.. కేసులు భారీగా పెరుగుతున్నాయి..
- చాలా మంది ఆస్పత్రుల్లో చేరుతున్నారు..
- కొందరు విషమ పరిస్థితుల్లో ఉంటున్నారు.
- ఇలాంటి పరిస్థితుల్లో ఒకరికి ఒకరు తోడై.. ప్లాస్మా దానం చేసి ప్రాణాలు కాపాడితే..కరోనాపై విజయం సాధించగలుగుతామని ప్లాస్మా దాతలు సూచిస్తున్నారు.
- మొదటి దశలో చాలా మంది అపోహలు, అనుమానాలతో కరోనాను జయించినవారు ప్లాస్మా దానానికి కొంత వెనుకంజ వేశారు.
- ఈ క్రమంలో కొందరు ప్లాస్మా దాతలు ముందుకు వచ్చి.. తాము రెండు, నాలుగు, ఏడుసార్లు ప్లాస్మా దానం చేశామని.. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని ధైర్యం నింపడంతో ఇప్పుడు చాలా మంది ప్లాస్మాదానానికి ముందుకు వస్తున్నారు.
- ప్లాస్మా దానం చేసిన తర్వాత 24 నుంచి 72 గంటల్లోగా పూర్తిగా తిరిగి శరీరంలోకి యాంటీబాడీస్లు చేరుతాయని దాతలు అంటున్నారు.
- దీంతో కరోనా విజేతలు ఎలాంటి అనుమానాలు, అపోహలకు పోకుండా ప్లాస్మాదానానికి ముందుకు వచ్చి మరికొందరి ప్రాణాలు కాపాడాలని ప్లాస్మాదాతలు కోరుతున్నారు.
మరో నలుగురిని రక్షిద్దామనుకుని…
- నాకు మొదటి దశలో కరోనా వచ్చింది.
- 85 శాతం ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వచ్చింది.
- చాలా విషమ పరిస్థితిలో ఉన్నా..
- ఆ సమయం లో నాకు అందిన సహాయం, వైద్య సేవలు నన్ను కరోనా నుంచి బయటపడేలా చేసింది.
- దీంతో నేను కూడా మరికొంత మందికి సహాయం చేయాలని నిర్ణయించుకున్నాను.
- ఇప్పటి వరకు నాలుగు సార్లు ప్లాస్మా దానం చేశాను.
- ప్లాస్మా దానం చేస్తే మరో ఇద్దరికి ప్రాణ దానం కల్పించినట్లు ఉంటుందని భావించి ముందుకువచ్చాను.
- ప్లాస్మా దానం చేసిన తర్వాత నాలో యాంటీ బాడీస్ బాగా ఉండే వి.
- దీంతో ఇంకా కొంత మందికి ఇవ్వొచ్చనే విషయం తెలుసుకుని మళ్లీ ఇచ్చాను.
- ప్లాస్మా ఇస్తే ఏమి కాదు.. అపోహలు, అనుమానాలు మాని ప్లా స్మా దానానికి కరోనా విజేతలు ముందుకు రావాలి. -హరీశ్, ట్రాన్స్‌పోర్టు వ్యాపారి
ఒకరికి సహాయం చేయాలనే ఆలోచనతో..
- ప్లాస్మా సరైన సమయానికి అందక చాలా మంది ఇబ్బంది పడుతున్నారని తెలుసుకున్నాను.
- నేను కరోనాను జయించడంతో ప్లాస్మా ఇచ్చి మరికొందరి ప్రాణాలను నిలబెట్టాలనుకున్నాను.
- అలాగే కొంతమందిలో చైతన్యం తీసుకురావచ్చనే ఆలోచనతో నాలుగు సార్లు ప్లాస్మా ఇచ్చాను.
- ఇప్పుడు నా శరీరంలో యాంటీ బాడీస్ పుష్కలంగా ఉన్నాయి. – విజయ్‌కుమార్, మెడికల్ అసిస్టెంట్
ఏడుగురికి ఇచ్చా..
- మా కుటుంబంలో ఏడుగురికి కరోనా వచ్చి.. బయటపడ్డాం.
- ఆ సమయంలో ప్లాస్మా గురించి తెలుసుకున్నాను.
- అవకాశం వస్తే ప్లాస్మా ఇద్దామని నిర్ణయించుకున్నాను.
- సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ పిలుపు మేరకు కుటుంబం మొత్తం ప్లాస్మా ఇవ్వడానికి రిజిస్టర్ చేసుకున్నాం.
- ఇలా.. నేను ఏడు మందికి ప్లాస్మా దానం చేశాను.
- ఇప్పుడు నా శరీరంలో 200లకు మించి యాంటీ బాడీస్ ఉన్నాయి.
- ఆరోగ్యంగా ఉన్నాను. – రవికుమార్, ప్రభుత్వ ఉద్యోగి
కర్ణాటకకు వెళ్లి ప్లాస్మా దానం చేశా..
నేను కరోనా బారిన పడ్డాను. ఆ సమయంలో వైద్య చికిత్సకు తోడు ప్లాస్మా దానం చేస్తే మరో ఇద్దరి ప్రాణం నిలబెట్టవచ్చని తెలుసుకున్నాను. దీంతో ఎవరికైనా ప్లాస్మా అవసరం ఉంటే ఇవ్వడానికి సిద్ధపడ్డాను. అదే సమయంలో మా పోలీసు అధికారి నుంచి కర్నాటకలో ఒకరికి అత్యవసరంగా ప్లాస్మా అవసరం ఉందని తెలుసుకున్నాను. వెంటనే అక్కడికి వెళ్లి ప్లాస్మా ఇచ్చాను. మరో ఇద్దరికి అవసరం ఉండటంతో వారికి కూడా ఇ చ్చాను. ప్లాస్మా దానం చేసిన 24 గంటల్లో నా శరీరంలో తిరిగి యాంటీ బాడీస్ వచ్చా యి. వారిని కరోనా నుంచి కాపాడానని సంతృప్తి మిగిలింది. – వీర బ్రహ్మం, సబ్ ఇన్స్పెక్టర్, మియాపూర్
సీపీ అవగాహన కల్పించారు..
ఒకరి ప్రాణం నిలబెడతామనే నమ్మకంతో నేను రెండుసార్లు ప్లాస్మా దానం చేశాను. ప్లాస్మా దానంతో ఎలాంటి అనారోగ్యం రాదని సైబరాబాద్ సీపీ కల్పించిన అవగాహనతోనే నేను ప్లాస్మా దానానికి ముందుకు వచ్చా ను. అపోహలు, అనుమానాలకు పోయి ఓ ప్రాణాన్ని కాపాడకుండా ఉండకండి. ప్లాస్మా దానంతో ఎలాంటి నష్టం ఉండదు. ముందుకు రండి. – భాస్కర్, ఇన్స్పెక్టర్, ఈఓడబ్ల్యూ సైబరాబాద్
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- Plasma Donation
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

