ప్లాస్మా ఇద్దాం.. ప్రాణాలు నిలుపుదాం..!

- ప్లాస్మాతో ఇప్పటికే 13వేల మందికి నయం
- వెంటనే రిజిస్టర్ చేసుకోండి
- 9490617440, లేదా donateplasma.scsc.in
- కరోనా విజేతలూ.. అపోహవీడి.. ముందుకు రండి
కరోనా విజేతలు ప్లాస్మా దానం చేసేందుకు ముందుకు రావాలని వైద్య నిపుణులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఒక్కరి ప్లాస్మాతో ముగ్గురి ప్రాణాలు కాపాడవచ్చని, ఇప్పటి వరకు 80శాతం వరకు ఫలితాలు సాధించామని చెబుతున్నారు. ప్లాస్మాదానంతో 13వేల మంది కరోనానుంచి బయటపడడం నిజంగా గొప్పవిషయమని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్లాస్మాదానంతో ఎలాంటి ప్రమాదం లేదని, కరోనాతో పోరాడి గెలిచిన వారు 15రోజుల తర్వాత ప్లాస్మాదానం చేసేందుకు ముందుకువచ్చి బాధితులకు అండగా నిలువాలని కోరుతున్నారు.
వైరస్‌ను నాశనంచేసే శక్తి ఉంటుంది.
ప్లాస్మాతో రోగిలో వైద్య చికిత్సలు పొందేందుకు అనువైన పరిస్థితులు ఏర్పడుతాయి. ఊపిరితిత్తులు, గుండె పై వైరస్ ప్రభావం పడకుండా అడ్డుకుంటుంది. శరీరంలో యాంటీ బాడీస్‌ను పెంచుతుంది. వెంటిలేటర్‌పై ఉండే వారికి ఒక శక్తిలా పనిచేస్తుంది. 80శాతం పైన ప్లాస్మాతో జరిగిన చికిత్సలు సంపూర్ణ ఫలితాలను ఇచ్చాయి. -సాయి రవిశంకర్, సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్టు, ఎస్ఎల్జీ హాస్పిటల్
ప్లాస్మా దానం చేయండి.. ప్రాణాలను నిలబెట్టండి
కరోనా విజేతలు ప్లాస్మా దానం చేయడానికి ముందుకు రావాలి. ప్లాస్మా దానంతో ఇద్దరు లేదా ముగ్గురి ప్రాణాలను నిలుపవచ్చు. తిరిగి 48 నుంచి 72 గంటల్లో ప్లాస్మా మీ శరీరంలో ఉత్పత్తి అవుతుంది. గత ఏడాది దాదాపు 6 వేల మంది దాతలు ముందుకు రావడంతో 10వేల మందిని కాపాడగలిగాం. తాజాగా 1400 మంది ప్లాస్మా ఇవ్వడంతో 2400 మందికి ఉపయోగం కలిగింది. ప్లాస్మా ఇవ్వాలన్నా, తీసుకోవాలన్నా.. సైబరాబాద్ కోవిడ్ కంట్రోల్ నం.9490617440, లేదా donateplasma.scsc.in లో రిజిస్టర్ చేసుకోవాలి.-సీపీ సజ్జనార్, సైబరాబాద్ పోలీసు కమిషనర్
యాంటీ బాడీస్ తగ్గిపోవు
ప్లాస్మాను అనేక రకాల మెడిసిన్‌తో కలిపి ఇస్తారు. ఇలా సమయానికి వైద్యం అందడంతో చాలా మంది కరోనా బాధితులు ప్రాణాలతో బయటపడ్డారు. కరోనా విజేతలు ఎలాంటి అనుమానాలు లేకుండా ముందుకు రావాలి. ప్లాస్మాదానంతో యాంటీ బాడీస్ తగ్గిపోవు. ప్రాణానికి ఎలాంటి హాని ఉండదు. శరీరంలో ఒక సారి యాంటీ బాడీస్ పెరుగడం మొదలైతే అవి పెరుగుతూనే ఉంటాయి. -నందకిశోర్, యశోద హాస్పిటల్..
రక్తదానంగా భావించాలి
- కరోనా విజేతలు ప్లాస్మా దానాన్ని రక్తదానంగా భావించాలి.
- కరోనా బాధితులకు వైరస్ సోకిన మొదటి 10 రోజుల్లో ప్లాస్మాను ఇస్తే ఫలితం ఉంటుంది.
- ప్లాస్మాదానం చేసే వారిలో యాంటీ బాడీస్ ఎక్కువగా ఉంటేనే తీస్తున్నాం.
- వ్యాక్సినేషన్ తీసుకున్న రోగుల్లో అధికంగా యాంటీ బాడీస్ ఉంటేనే తీస్తాం.
- కాని అవి అంత సమర్థవంతంగా పనిచేయడం లేదని తెలుస్తుంది. -డా.కార్తీక్, ఏఐజీ హాస్పిటల్.
ప్లాస్మా కచ్చితంగా పని చేస్తుంది
కోవిడ్ బారిన పడిన వారు త్వరగా దవాఖానలో చేరితే వైద్య చికిత్సలు, మందులతో కలిపి ప్లాస్మాను అందిస్తున్నాం. ఇలాంటి చికిత్స అందిన వారు చాలామంది ప్రాణపాయ స్థితి నుంచి బయటపడ్డారు. కరోనా లక్షణాలను ముందుగానే గుర్తించి వెంటనే దవాఖానలో చేరితే ప్రమాదం తప్పుతుంది. -డా.అపర్ణ శర్మ, కేర్ హాస్పిటల్.
ఇద్దరిదీ ఒకే గ్రూపు అయి ఉండాలి..!
- ప్లాస్మాదానం చేయాలంటే కరోనా విజేతలై ఉండాలి. 15 రోజుల తర్వాత ఇవ్వొచ్చు.
- వైరస్‌తో పోరాడే యాంటీ బాడీస్ అధికంగా ఉండాలి.
- ప్లాస్మా దానం చేసే వారిది, ప్లాస్మా అవసరం ఉన్న వారిది ఒకటే బ్లడ్ గ్రూపు అయి ఉండాలి.
- 18 నుంచి 55సంవత్సరాలు వయస్సు వారు, షుగర్, బీపీ ఉన్న వారు కూడా ప్లాస్మా దానం చేయవచ్చు.
- గర్భిణులు, హెచ్ఐవీ, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ అయిన వారు, క్యాన్సర్, టీబీ, ఏదైనా సర్జరీ అయిన వారు, ఆరు నెలల కిందట టాటూ వేసుకున్న వారు ప్లాస్మా ఇవ్వడానికి అనర్హులు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- Plasma Donation
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

