పేదోళ్ల దవాఖాన
సమాజ సేవా చేయాలనే తపన కొందరిలోనే ఉంటుంది. ఆకోవాకు చెందినదే హెల్పింగ్ హ్యాండ్ అనే స్వచ్ఛంద సంస్థ. తుమ్మినా.. దగ్గినా.. చేయి పట్టి నాడీ చూసి లక్షలు వసూలు చేస్తున్న ఈ రోజుల్లో ఏమీ ఆశించకుండా కేవలం మానవతా దృక్పథంతో వేలాది మంది నిరుపేదలకు ఉచితంగా వైద్యం
సేవే లక్ష్యం.. పేదలకు అభయం..!
హెల్పింగ్ హ్యాండ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్యం
ప్రతిరోజూ సుమారు 300 మందికి..
షాహీన్‌నగర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు బారులు తీరుతున్న రోగులు
పహాడీషరీఫ్, ఏప్రిల్ 14: సమాజ సేవా చేయాలనే తపన కొందరిలోనే ఉంటుంది. ఆకోవాకు చెందినదే హెల్పింగ్ హ్యాండ్ అనే స్వచ్ఛంద సంస్థ. తుమ్మినా.. దగ్గినా.. చేయి పట్టి నాడీ చూసి లక్షలు వసూలు చేస్తున్న ఈ రోజుల్లో ఏమీ ఆశించకుండా కేవలం మానవతా దృక్పథంతో వేలాది మంది నిరుపేదలకు ఉచితంగా వైద్యం, మందులు అందజేస్తున్నది హెల్పింగ్ హ్యాండ్ సంస్థ. జల్పల్లి మున్సిపాలిటీ షాహీన్‌నగర్ పరిధిలోని అలైన్ కాలనీలో రెండేండ్ల కిందట హెల్పింగ్ హ్యాండ్ అనే స్వచ్ఛంద సంస్థ ‘కమ్యూనిటీ హెల్త్ సెంటర్’ను ఏర్పాటు చేసింది.
అప్పటి నుంచి పైసా వసూలు చేయకుండా పూర్తి ఉచితంగానే వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు మందులు సైతం ఉచితంగానే అందజేస్తున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు ఐదు మంది వైద్యులు (ఫిడియాట్రిక్, గైనకాలజిస్ట్, డయాబెటిక్, డెంటల్, జనరల్) ప్రతి రోజు సుమారు 300 మందికి వైద్య సేవలు అందిస్తున్నారు. చిన్నపాటి ఆపరేషన్లు ఉంటే ఇక్కడే నిర్వహిస్తున్నారు. మేజర్ సమస్యలు ఏవైనా ఉంటే మెరుగైన వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా దవాఖానకు పంపిస్తారు.
తక్కువకే పరీక్షలు
ఏ చిన్న సమస్య వచ్చినా ఇక్కడికే వస్తాం. 25 శాతం డబ్బులు మాత్రమే తీసుకుని ఎక్స్‌రే, ఎంఆర్ఐ, స్కానింగ్‌లు, రక్త పరీక్షలు చేస్తారు. ఈ దవాఖాన మాలాంటి పేదోళ్లకు ఎంతో సహాయ పడుతుంది. – జహీరా బేగం, బిస్మిల్లా కాలనీ
పైసా ఖర్చు లేకుండా వైద్యం అందింది
ప్రమాదవశాత్తు నా కాలుకు గాయమైంది. ప్రైవేట్ దవాఖానకు వెళ్లలేని పరిస్థితి. హెల్పింగ్ హ్యాండ్ స్వచ్ఛంద సంస్థ గురించి తెలుసుకుని వైద్యం కోసం ఇక్కడికి వచ్చాను. అప్పటికే పరిస్థితి విషమించింది. పరీక్షించిన వైద్యులు ఉస్మానియా దవాఖానకు తరలించి కాలుకు ఆపరేషన్ చేయించారు. ఉచితంగా మందులు ఇచ్చారు. పైసా ఖర్చు లేకుండా వైద్యం అందింది.
– షేక్ అలీం, షాహీన్‌నగర్
పేదోళ్లు ఆరోగ్యంగా ఉండాలి
నిరుపేదలు నిత్యం ఆరోగ్యంగా ఉండాలన్నదే హెల్పింగ్ హ్యాండ్ సంస్థ ఉద్దేశం. దవాఖానకు వచ్చే ప్రతి ఒక్కరికీ ఉచితంగానే వైద్యం అందించి మందులు ఇస్తాం. పెద్ద సమస్య ఉంటే ఉస్మానియా దవాఖానకు పంపిస్తాం. వారు పూర్తిగా నయమయ్యే వరకు మా సభ్యులు వారికి తోడుగా ఉంటారు.
– రిజ్వానా, అడ్మినిస్ట్రేషన్, షాహీన్‌నగర్ శాఖ
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

