Ovarian cyst | మహిళ కడుపులో నుంచి 10.6 కేజీల అండాశయ తిత్తి తొలగింపు
Medchal | కడుపు ఉబ్బడం వంటి సమస్యతో బాధపడుతున్న ఓ మహిళ కడుపులో నుంచి 10.6 కేజీల అండాశయ తిత్తిని మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్( MRIMS ) సర్జన్లు తొలగించారు. ప్రస్తుతం బాధిత మహిళ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
Ovarian cyst | కడుపు ఉబ్బడం వంటి సమస్యతో బాధపడుతున్న ఓ మహిళ కడుపులో నుంచి 10.6 కేజీల అండాశయ తిత్తి( ovarian cyst )ని మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్( MRIMS ) సర్జన్లు తొలగించారు. ప్రస్తుతం బాధిత మహిళ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
వివరాల్లోకి వెళ్తే.. మేడ్చల్కు చెందిన మల్లమ్మ(62)కు గత ఏడాది కాలం నుంచి కడుపు ఉబ్బుతుంది. కానీ ఆమెకు ఎలాంటి నొప్పి లేదు. దీంతో ఆమె మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సర్జన్లను సంప్రదించింది. మల్లమ్మకు సర్జన్లు పరీక్షలు నిర్వహించగా, అండాశయంపై అండాశయం తిత్తి ఏర్పడినట్లు గుర్తించారు. ఆ తిత్తి కారణంగా కడుపు ఉబ్బడం జరిగిందని నిర్ధారించిన వైద్యులు.. శస్త్ర చికిత్స ద్వారా దాన్ని తొలగించారు. ఆ తిత్తి బరువు 10.6 కేజీలుగా ఉందని సర్జన్లు స్పష్టం చేశారు.
నిలకడగా మల్లమ్మ ఆరోగ్యం
మల్లమ్మ ఆరోగ్యం నిలకడగా ఉందని జనరల్ సర్జన్ డాక్టర్ రామ్మోహన్ రావు స్పష్టం చేశారు. విజయవంతంగా తిత్తిని తొలగించామన్నారు. 25 ఏండ్ల క్రితం ఆమె గర్భాశయాన్ని తొలగించుకున్నారని తెలిపారు. అయితే హార్మోన్లు సమతుల్యంగా లేని కారణంగా అండాశయ తిత్తులు ఏర్పడుతాయన్నారు. ఈ తిత్తిలో ద్రవపదార్థం నిండి ఉంటుందని చెప్పారు. పెల్విక్ ఇన్ఫెక్షన్ల కారణంగా కూడా ఈ సమస్య ఏర్పడే అవకాశం ఉందన్నారు. అండాశయ తిత్తులను ప్రాథమిక దశలోనే గుర్తించి, చికిత్స చేయించుకుంటే మంచిదని సూచించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | పాలమూరు బాధితులకు రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలి : హరీష్రావు డిమాండ్
V Hanumantha Rao | నేను మాట్లాడొద్దా.. స్పీచ్ మధ్యలో సీఎం రేవంత్ రెడ్డిని అడ్డుకున్న వీ హన్మంతరావు.. వీడియో
Farmers Protest | వ్యవసాయానికి నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయాలని రైతుల మహాధర్నా
Rahul Gandhi | జ్ఞానేష్ కుమార్కు వ్యతిరేకంగా రాహుల్, ప్రతిపక్షాల పిటిషన్.. రిజిష్టర్ చేసిన సుప్రీంకోర్టు
తుమ్మడంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

