హైదరాబాద్: హైదరాబాద్‌లోని గచ్చిబౌలి (Gachibowli) బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌పై (Biodiversity flyover) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం అర్ధరాత్రి సమయంలో బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌పై ఓ స్పోర్ట్స్ బైక్ (Sports Bike) అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో ఓ యువకుడు అక్కడికక్కడే మృతిచెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రుడిని దవాఖానకు తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. మృతుడిని గచ్చిబౌలికి చెందిన మధు (25)గా గుర్తించారు. అతివేగమే ప్రమాధానికి కారణమని నిర్ధారించారు. ఈ ఘటపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.