ట్రాఫిక్ సమస్య లేకుండా..
ట్రాఫిక్ సమస్యలు లేకుండా చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలకు, వాహనదారులకు ట్రాఫిక్ కష్టాలు లేకుండా చర్యలు చేపట్టారు. అందులో భాగంగా ప్రధానంగా ఫుట్‌పాత్‌ల ఆక్రమణలపై ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.
- ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక దృష్టి
- ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపు..
చిక్కడపల్లి, జనవరి 27 : ట్రాఫిక్ సమస్యలు లేకుండా చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలకు, వాహనదారులకు ట్రాఫిక్ కష్టాలు లేకుండా చర్యలు చేపట్టారు. అందులో భాగంగా ప్రధానంగా ఫుట్‌పాత్‌ల ఆక్రమణలపై ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. వాహనదారులకు ఇబ్బందిగా మారిన ఫుట్‌పాత్ ఆక్రమణలను తొలగిస్తున్నారు. ప్రధానంగా రద్దీ ప్రాంతాలను గుర్తించి ట్రాఫిక్ సమస్యలను పరిష్కరిస్తున్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని చిక్కడపల్లి, గాంధీనగర్, రాంనగర్, కవాడిగూడ మేకలమండి, బండమైసమ్మ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంటుంది. ఈ ప్రాంతాల్లో ఫుట్‌పాత్‌లను చిరు వ్యాపారులు ఆక్రమించడంతో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా మారుతుంది. దీంతో ఈ ప్రాంతాల్లో ఫుట్‌పాత్‌పై ఆక్రమణలను తొలగిస్తున్నారు. ఆక్రమణలను తొలగించాలని చెప్పినా.. పట్టించుకోని వారిపై చట్టరీత్య కేసులు నమోదు చేస్తున్నారు.
ఫుట్‌పాత్‌ను ఆక్రమిస్తే.. చర్యలు
ఫుట్‌పాత్‌లను కబ్జా చేసి అక్రమ వ్యాపారాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటాం. ట్రాఫిక్ సమస్య పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఫుట్‌పాత్ ఆక్రమణలతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇకపై ఫుట్‌పాత్‌లను కబ్జా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.
– దరావత్ నాను నాయక్, చిక్కడపల్లి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

