సెంటిమెంట్ నంబర్.. లక్షల్లో డిమాండ్
ఫ్యాన్సీ నంబర్లే కాదు సాధారణ నంబర్లు కూడా ఆర్టీఏకు ఆదాయం సమకూరుస్తున్నాయి. లక్కీ నంబర్లు, మ్యారేజ్ డే, పుట్టినరోజులు ఇలా ఏదో ఒక నంబర్‌తో వాహనదారులు కనెక్ట్ అయిపోతుండటంతో ఆదాయం కూడా ఆ మేరకు ఆర్టీఏకు పెరుగుతున్నది. ఎప్పటి లాగా ఈ ఏడాది ఇప్పటి వరకు ఫ్యాన్సీ నంబర్లతో 57 కోట్ల ఆదాయం సమకూరింది.
- ఈ ఏడాది రూ.21.60 లక్షలతో అత్యధికంగా ధర పలికిన 9999
- సెంటిమెంట్ నంబర్లకు ఫుల్ డిమాండ్
- ఇప్పటి వరకు 57.6 కోట్ల ఆదాయం
- గత ఏడాది 72 కోట్లు
- పుట్టిన రోజు, మ్యారేజ్ డే, లక్కీ నంబర్లు, చివరి ఫోన్ నంబర్లు కలిసేలా..వాహనాలకు అంకెలు
- ఫ్యాన్సీతో పాటు సాధారణ నంబర్లతోనూ ఆర్టీఏకు ఆదాయం
సిటీబ్యూరో, డిసెంబర్ 21(నమస్తే తెలంగాణ): ఫ్యాన్సీ నంబర్లే కాదు సాధారణ నంబర్లు కూడా ఆర్టీఏకు ఆదాయం సమకూరుస్తున్నాయి. లక్కీ నంబర్లు, మ్యారేజ్ డే, పుట్టినరోజులు ఇలా ఏదో ఒక నంబర్‌తో వాహనదారులు కనెక్ట్ అయిపోతుండటంతో ఆదాయం కూడా ఆ మేరకు ఆర్టీఏకు పెరుగుతున్నది. ఎప్పటి లాగా ఈ ఏడాది ఇప్పటి వరకు ఫ్యాన్సీ నంబర్లతో 57 కోట్ల ఆదాయం సమకూరింది.
ఇందులో అత్యధిక వాటా అందించిన నంబర్ 9999. వీటితో పాటు చాలానంబర్లను వాహనదారులు లక్షల్లో వెచ్చించి దక్కించుకున్నారు. కొందరు తమ పేర్లతో వాహనాలు రిజిస్ట్రేషన్ చేసుకుంటే మరికొందరూ కంపెనీలపై వాహనాలను రిజిస్ట్రేషన్ చేయించారు. వీరిలో కంపెనీ, సొంత వాహనం నంబర్లు ఒకేలా ఉండేలా చూసుకోవడం ఇటీవల పెరిగింది. గత ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 72 కోట్ల ఆదాయం కేవలం ఫ్యాన్సీ నంబర్లపైనే వచ్చింది.
ఇప్పుడు ఆ మార్క్‌ను అధిగమిస్తుందా లేదా అనేది ఈనెల చివరి వరకు వేచి చూడాల్సి ఉంటుంది. ఈ ఏడాది ఇప్పటి వరకు ఖైరతాబాద్ సిరీస్‌తో కూడిన (టీఎస్09) 9999 నంబర్ అత్యధికంగా 21.60 లక్షలకు అమ్ముడుపోయింది. అధికంగా ఖైరతాబాద్ పరిధిలో ఫ్యాన్సీ నంబర్లకు డిమాండ్ ఉంటుంది. టీఎస్09జీడీ9999 నంబర్ 10.50 లక్షలకు మెగా ఇంజినీరింగ్ కైవసం చేసుకుంది. టీఎస్ఈ11ఈజెడ్9999ను రూ.9.99 లక్షలకు చర్చ్ ఎడ్యుకేషనల్ సొసైటీ నంబర్ దక్కించుకుంది. ఈ సంఖ్యతో పాటు 0001, 0009, 0999లకు రూ.50 సాధారణ ఫీజుగా ఆర్టీఏ నిర్ణయించింది.
ఈ డబ్బులు చెల్లించాక బిడ్డింగ్‌లో పోటీ పడాల్సి ఉంటుంది. ఇక 0333, 0555, 0666, 0777, 0888,2222, 3333, 4444,5555, 6666, 7777, 8888 నంబర్లతో పాటు సాధారణ నంబర్లకూ పోటీ ఉంటుంది. ఇటీవల 0027 నంబర్ రూ.లక్ష రూపాయలకు శ్రీనివాస్ అనే వ్యక్తి దక్కించుకున్నాడు. 1207 నంబర్‌ను మరో వ్యక్తి రూ.12వేలకు కైవసం చేసుకున్నాడు. ఇలా ఫ్యాన్సీ నంబర్లతో ఆర్టీఏకు ఆదాయం కలిసి వస్తున్నది. గత 9 ఏండ్లలో రావాణా ఖజానాలో ఫ్యాన్సీ నంబర్లతో రూ.387 కోట్లు జమ అయింది. గత ఏడాది రూ.72 కోట్లకు పైగా ఫ్యాన్సీ ఆదాయం రాగా, ఈ ఏడాది డిసెంబర్ ప్రస్తుతం వరకు రూ. 57.6 కోట్లు ఆదాయం సమకూరినట్టు అధికారులు తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

