నిమ్స్‌లో మీడియాకు నో ఎంట్రీ!
నగరంలోని ప్రతిష్టాత్మక నిమ్స్ దవాఖానాలో మీడియాను నిలువరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రభుత్వ మార్పు తర్వాత దవాఖానాలో పరిపాలన విభాగం మొత్తం అస్తవ్యస్తమైనట్లు ఆస్పత్రి వర్గాలే బాహాటంగా చెబుతున్నాయి.
- గోప్యత సమాచారం బయటకు వెళ్తుందంటూ ఓ వైద్యాధికారి లేఖ
- సొంత ఆస్పత్రి స్టాఫ్‌పైనే చర్యలు తీసుకోవాలని కోరిన వైనం
- లీకులపై ఆధారాలు సమర్పించాలన్న మెడికల్ సూపరింటెండెంట్
ఖైరతాబాద్, సెప్టెంబర్ 17: నగరంలోని ప్రతిష్టాత్మక నిమ్స్ దవాఖానాలో మీడియాను నిలువరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రభుత్వ మార్పు తర్వాత దవాఖానాలో పరిపాలన విభాగం మొత్తం అస్తవ్యస్తమైనట్లు ఆస్పత్రి వర్గాలే బాహాటంగా చెబుతున్నాయి. పలు విభాగాల్లో అవకతవకలు, అక్రమాలపై తరచూ మీడియాలో కథనాలు వస్తుండటంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న కొందరు వైద్యాధికారులు మీడియాను నిలువరించే చర్యలకు ఉపక్రమించినట్లు కనిపిస్తోంది.
తాజాగా ఓ వైద్యాధికారి నేరుగా మెడికల్ సూపరింటెండెంట్‌కు లేఖ రాయడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే….ఆస్పత్రి అదనపు మెడికల్ సూపరింటెండెంట్ పేరుతో ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్‌కు అధికారిక లేఖ అందింది. నిమ్స్ గోప్యతకు భంగం వాటిల్లుతుందని, కొందరు సిబ్బంది మీడియాకు లీకులు ఇస్తున్నారని, వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని, మీడియాపై నిషేదాజ్ఞలు విదించాలన్నది దాని సారాంశం. అయితే ఆ లేఖ సైతం మీడియాకు లీకు కావడంతో దీనిపై సర్వత్రా చర్చ మొదలైంది.
సొంత సిబ్బందినే టార్గెట్ చేసి..
నిమ్స్ దవాఖాన ప్రభుత్వ సహకారంతో పేద ప్రజలకు వివిధ సంక్షేమ పథకాలపై పూర్తిగా ఉచితంగా వైద్యం అందిస్తున్న స్వయం ప్రతిపత్తి కలిగిన వైద్యశాల. కాగా, అవినీతి అక్రమాలు ఎదుర్కొంటున్న ఓ వైద్యాధికారి భాగోతాలను ఇటీవల మీడియా వెలుగులోకి తెచ్చింది. దీంతో సదరు వైద్యాధికారి ఆస్పత్రిలో జరిగే అవినీతి అక్రమ కోణాలు మీడియాకు తెలియనివ్వకుండా చేయడం కోసమే ఆ లేఖ రాసినట్లు తెలుస్తోంది. అందులో సొంత వైద్యశాలలో పనిచేస్తున్న సిబ్బందిని టార్గెట్ చేసి మీడియాకు లీకులిచ్చేవారిపై కఠిన, క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరడం విశేషం. అయితే సదరు అధికారి సూపరింటెండెంట్‌ను ఆదేశించినట్లుగా లేఖ ఉండడంతో చిర్రుబుర్రు లాడినట్లు తెలిసింది.
మీడియాకు లీకులిచ్చినట్లు ఆధారాలు ఉన్నాయా..?
కాగా, మెడికల్ సూపరింటెండెంట్ ఆ లేఖను తప్పుపట్టినట్లు సమాచారం. సదరు అదనపు అధికారి గోపత్య సమాచారమంటే ఏమిటో ఆ లేఖలో పేర్కొనలేదని, మీడియాకు లీక్ చేసిన సమాచారమేమిటో చెప్పలేదని, అందులో ఉపయోగించిన భాష సైతం ఆక్షేపణీయమని, సరైన ఆధారాలు లేకుండా సిబ్బంది, మీడియాపై నిందనలు వేయడం సరికాదని ఓ వివరణ లేఖను డైరెక్టర్‌కు పంపించినట్లు తెలిసింది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

