నిజాం కళాశాల విద్యార్థులు శనివారం హోలీ వేడుకల్లో మునిగితేలారు. హోలీ పండుగ సోమవారం కావడం, ఆదివారం కళాశాలకు సెలవు దినం కాగా, ముందస్తుగానే ఉత్సవానికి తెరలేపారు.
విద్యార్థులు రంగులు చల్లుకుంటూ వేడుకను ఎంతో ఉత్సాహంగా, అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఒకరికొకరు రంగోలి చల్లుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకొని ఆనంద తాండవం చేశారు.