CMR | ఉప్పల్, మార్చి 28 : ఉప్పల్‌లో సీఎంఆర్ షాపింగ్ మాల్ పునః ప్రారంభమైంది. గురువారం సినీనటి నిధి అగర్వాల్, వజ్రం కన్స్ట్రక్షన్ చైర్మన్ కోల ఆంజనేయులు హాజరై ఈ షాపింగ్ మాల్‌ను ప్రారంభించారు. ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన నటి నిధి అగర్వాల్ సందడి చేశారు.
పలు రకాల వస్ర్తాలను పరిశీలించారు. అభిమానులు నిధి అగర్వాల్‌తో ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. ఈ సందర్భంగా సీఎంఆర్ ఫౌండర్, చైర్మన్ మావూరి వెంకటరమణ మాట్లాడుతూ షాపింగ్‌మాల్‌లో అన్నిరకాల వస్ర్తాలు.. అందరికీ నచ్చేవిధంగా అతి తక్కువ ధరలకే లభిస్తున్నాయన్నారు.