2న బోరబండ పోలీస్‌స్టేషన్ ప్రారంభం
బోరబండలో నూతన పోలీస్ స్టేషన్ అన్ని హంగులతో సిద్ధమైంది. ఇప్పటి వరకు బోరబండ సైట్-2 కాలనీలో కొనసాగిన ఔట్‌పోస్ట్ ఇక నుంచి ఠాణాగా మారనున్నది. జూన్ 2న దీన్ని ప్రారంభించటానికి ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి.
ఎర్రగడ్డ, మే 30: బోరబండలో నూతన పోలీస్ స్టేషన్ అన్ని హంగులతో సిద్ధమైంది. ఇప్పటి వరకు బోరబండ సైట్-2 కాలనీలో కొనసాగిన ఔట్‌పోస్ట్ ఇక నుంచి ఠాణాగా మారనున్నది. జూన్ 2న దీన్ని ప్రారంభించటానికి ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. 10 రోజుల క్రితమే బోరబండ ఠాణాకు కేటాయించిన వాహనాలు ఇక్కడికి చేరుకున్నాయి. ఈ నూతన పోలీస్‌స్టేషన్‌కు తొలి స్టేషన్ హౌస్ ఆఫీసర్‌గా కామల్ల రవికుమార్ ఇప్పటికే బాధ్యతలు తీసుకున్నారు. ఎస్సార్‌నగర్ ఠాణా పరిధికి చెందిన బోరబండ పోలీస్ ఔట్‌పోస్ట్‌కు దాదాపు 40 ఏండ్ల చరిత్ర ఉన్నది. విశాలమైన ప్రాంగణంలో ఉన్న ఔట్‌పోస్ట్ స్థానంలో నూతన పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేయాలని ఐదారు నెలల క్రితం పోలీస్ శాఖ నిర్ణయించింది.
పశ్చిమ మండలంలోని ఎస్సార్‌నగర్ డివిజన్ పరిధిలోకి బోరబండ ఠాణా వస్తుంది. బోరబండ పూర్తి డివిజన్‌తో పాటు ఎర్రగడ్డ డివిజన్లోని సగం ఏరియా, గతంలో జూబ్లీహిల్స్ ఠాణా పరిధిలో ఉన్న రహ్మత్‌నగర్ డివిజన్లోని హిల్స్ బస్తీలు బోరబండ పోలీస్‌స్టేషన్ పరిధిలో చేర్చటం జరిగింది. మూసాపేట డివిజన్‌కు చెందిన బీఎస్పీ(బాలాజీ స్వర్ణపురి) కాలనీ కూడా. మొత్తానికి 3.5 లక్షల జనాభా బోరబండ ఠాణా పరిధిలో ఉంటుందని అంచనా వేశారు. ఇక నూతన ఠాణా ప్రాంగణాన్ని తీర్చిదిద్దే పనులు పూర్తయ్యాయి. పోలీస్ ఇన్స్పెక్టర్ చాంబర్, సీసీ టీవీల గది, వాహనాల పార్కింగ్ ఏరియా తదితర వాటిని పూర్తి చేశారు. బోరబండ నూతన ఠాణా సి బ్బంది వివరాలను ఎస్హెచ్ఓ రవికుమార్ వివరించా రు. మొత్తం 4 సెక్టార్లుగా విభజించినట్లు తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
Horoscope | 24-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

