HMDA | హెచ్ఎండీఏకు కొత్త కమిషనర్ ?
హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ)కు కొత్త మెట్రోపాలిటన్ కమిషనర్ రానున్నారా? అంటే అవుననే అంటున్నాయి అధికార వర్గాలు. రాష్ట్రంలో సుదీర్ఘ కాలం ఎన్నికల కోడ్ అమల్లో ఉంది.
HMDA | సిటీబ్యూరో, జూన్ 5 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ)కు కొత్త మెట్రోపాలిటన్ కమిషనర్ రానున్నారా? అంటే అవుననే అంటున్నాయి అధికార వర్గాలు. రాష్ట్రంలో సుదీర్ఘ కాలం ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. అసెంబ్లీ ఎన్నికల ముగిసిన రెండు నెలలకే మళ్లీ పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. దీంతో రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో కొత్తగా నియామకాలు, ఉన్నతాధికారుల బదిలీలను చేపట్టలేదు. ప్రస్తుతం గురువారంతో ఎన్నికల కోడ్ ముగియనుండటంతో పెద్ద ఎత్తున అధికారుల బదిలీలు ఉండనున్నాయి.
హైదరాబాద్ మహానగరాభివృద్ధిలో ఎంతో కీలకమైన హెచ్ఎండీఏ కమిషనర్‌ను సైతం మార్చి కొత్త వారిని నియమించనున్నారనే సమాచారం. ఇదే విషయాన్ని హెచ్ఎండీఏలో ప్రధానంగా చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీగా ఉన్న దాన కిశోర్ హెచ్ఎండీఏ కమిషనర్‌గానూ వ్యవహరిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో హెచ్ఎండీఏకు ప్రత్యేకంగా కమిషనర్ ఉంటేనే పరిపాలన బాగుంటుందనే అభిప్రాయాన్ని ఉద్యోగులతో పాటు ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే సీనియర్ ఐఏఎస్ అధికారుల్లో ఒకరిని మెట్రో పాలిటన్ కమిషనర్‌గా నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది. అదేవిధంగా హెచ్ఎండీఏలోని వివిధ విభాగాల్లోనూ ఉన్నతాధికారుల బదిలీలు ఉంటాయన్న చర్చ జరుగుతున్నది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | ఎలాన్ మస్క్ ఆదేశాలతోనే ఉక్రెయిన్‌లో నెమ్మదించిన స్టార్లింగ్ శాటిలైట్ నెట్వర్క్..!
Shreyas Iyer: తుది జట్టులో వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కడం కష్టమే: శ్రేయాస్ అయ్యర్
Okra | బెండకాయ జిగురు మంచిదేనా? జీర్ణక్రియ, కొలెస్ట్రాల్‌పై కీలక విషయాలు!
Thallapeta clashes | ఘర్షణలతో పోలీసుల పహారాలో తాళ్లపేట.. మంచిర్యాలలో ఉత్కంఠ.. వీడియో
Iran vs US | ఒక్క గ్రాము యురేనియం కూడా మా దేశం నుంచి బయటికి వెళ్లదు : ఇరాన్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

