MVSR College | హైదరాబాద్ ఎంవీఎస్ఆర్ కాలేజీ దుర్ఘటన.. విద్యార్థిని మృతి కేసులో ముగ్గురు అరెస్ట్
MVSR College | రంగారెడ్డి జిల్లా నాదర్గుల్లోని ఎంవీఎస్ఆర్ ఇంజినీరింగ్ కాలేజీలో దసరా వేడుకల సందర్భంగా జరిగిన ప్రమాదానికి సంబంధించి పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు.
MVSR College | రంగారెడ్డి జిల్లా నాదర్గుల్లోని ఎంవీఎస్ఆర్ ఇంజినీరింగ్ కాలేజీలో దసరా వేడుకల సందర్భంగా జరిగిన ప్రమాదానికి సంబంధించి పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో ఈవెంట్ నిర్వాహకుడు మల్లెల సాకేత్ (22), లైటింగ్ అండ్ సౌండ్స్ పనులతో సంబంధం ఉన్న బత్తుల పునీత్ (21), సాయం నిశాంత్ యాదవ్ (24) ఉన్నారు. అక్టోబర్ 17న కాలేజీలో నిర్వహించిన డాండియా కార్యక్రమంలో వేదిక పక్కన ఏర్పాటు చేసిన ఇనుప ట్రస్ కూలిపోవడంతో ఓ విద్యార్థిని మృతి చెందగా, మరో 22 మంది గాయపడిన సంగతి తెలిసిందే.
అక్టోబర్ 17న దాండియా కార్యక్రమం జరుగుతున్న సమయంలో వేదిక పక్కన ఏర్పాటు చేసిన తాత్కాలిక ఇనుప నిర్మాణం విద్యార్థులపై కూలిపోయింది. ఈ ఘటనలో నారాయణదాస్ సోనా చిలిక్తి అనే విద్యార్థిని మృతి చెందింది. మరో 22 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్లు తెలిసింది. ప్రాథమిక విచారణలో ట్రస్ నిర్మాణానికి నాలుగు స్తంభాల బదులు రెండింటినే ఉపయోగించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు ఈ కేసులో మొత్తం ఏడుగురిని నిందితులుగా గుర్తించి, ముగ్గురిని అరెస్టు చేశారు. మిగిలిన నలుగురు పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
నిందితుల నుంచి మొబైల్ ఫోన్లు, ఒప్పంద పత్రాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఘటనాస్థలిలో 19 మీటర్ల పొడవైన ట్రస్‌తో పాటు అనుమతులు లేని డీజే సౌండ్ సిస్టమ్‌ను సీజ్ చేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MVSR College | హైదరాబాద్ ఎంవీఎస్ఆర్ కాలేజీ దుర్ఘటన.. విద్యార్థిని మృతి కేసులో ముగ్గురు అరెస్ట్
Rahul Gandhi | రాహుల్ గాంధీ అమెరికన్ ఎత్తుగడలు.. సీజేపీపై ఆయన వ్యూహం ఎందుకు ఫలించడం లేదు!
Vegetable Nutrition | కూరగాయలు తింటున్నా పోషకాలు అందడం లేదా? ఈ వంటింటి చిట్కాలు తెలుసుకోండి!
Section 22A | సెక్షన్ 22ఏ జాబితా నుంచి తొలగించినా.. ఆస్తులు కొనేందుకు వెనుకడుగు వేస్తున్న ప్రజలు!
India vs Zimbabwe | హర్మన్‌ప్రీత్ విధ్వంసం.. షఫాలీ సునామీ.. జింబాబ్వే సిరీస్ క్లీన్‌స్వీప్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

