రోడ్ల మరమ్మతులకు ప్రత్యేక చర్యలు

కవాడిగూడ, ఏప్రిల్ 16: ముషీరాబాద్‌లో రోడ్ల మరమ్మతులకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ముషీరాబాద్‌లో రూ. 1.82 కోట్ల నిధులతో వీడీసీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఆయన స్థానిక కార్పొరేటర్ సుప్రియ నవీన్‌గౌడ్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. ముషీరాబాద్ డివిజన్ గంగపుత్ర కాలనీ నుంచి పార్శిగుట్ట వరకు రూ. 92లక్షలు, మొరంబొంద నుంచి జీఎన్ గార్డెన్ వరకు రూ. 90లక్షల వ్యయంతో వీడీసీసీ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజక వర్గంలో రోడ్లను ఆధునీకరించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి జీహెచ్ఎంసీ కమిషన్‌ర్‌కు అందజేశామన్నారు. రోడ్డు నిర్మాణ పనులు పూర్తైన వెంటనే డ్రైనేజీ పైపులైన్ పనులను చేపడుతామని అన్నారు. కార్పొరేటర్ సుప్రియ నవీన్‌గౌడ్ మాట్లాడు తూ.. బాపూజీనగర్‌లో డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉందని అన్నా రు. నూతన పైపులైన్‌కు నిధులు కూడా మంజూరయ్యాయని, అధికారులు పనులు ప్రారంభించడం లేదని, పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఆమె ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సయ్యద్ మహ్మద్ భక్తీయార్, వరుణ్, బీజేపీ డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు బద్రినారాయణ, కంచి కుమార్, ముదిరాజ్ నాయకులు డి. శివ ముదిరాజ్, జి. గోవింద్, లక్ష్మణ్‌గౌడ్, ప్రశాంత్, అనిల్‌కుమార్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

