Parking | హైదరాబాద్‌లో పార్కింగ్ పరేషాన్.. అద్దె ఇంటి వాహనదారుల జేబులకు చిల్లు
ఎంత ఖరీదైన కారు కొన్నా.. అది నిలిపేందుకు పార్కింగ్ లేకపోతే ఓనరుకు కంటి మీద కునుకు లేనట్టే. రోడ్డుపై వాహనం నిలిపితే ఏదైనా డ్యామేజీ అవుతుందనే భయం వెంటాడుతుంటుంది. రోడ్డుపై కూడా స్థలం లేకపోతే పక్క కాలనీయో..
- పార్కింగ్ సదుపాయం కోసం అన్వేషిస్తున్న అద్దె ఇంటి వాహనదారులు
- నెలకు రూ.15 వందల నుంచి 2వేలకు పైగా చార్జి
- అంతకు మించి ఇస్తామంటూ పోటీ వాతావరణం
- పార్కింగ్ సదుపాయాన్ని అద్దెకు ఇస్తూ క్యాష్ చేసుకుంటున్న ఇంటి ఓనర్లు
- నగరంలో ఇంటి గేట్లకు పార్కింగ్ బోర్డుల ఏర్పాటు
- కారున్నా.. పార్కింగ్ లేదని సతమతం
- సెకెండ్ హ్యాండ్ కార్లు తక్కువ ధరలో వస్తుండటంతో అధికంగా కార్ల కొనుగోళ్లు
Parking | సిటీబ్యూరో, జనవరి 14(నమస్తే తెలంగాణ): ఎంత ఖరీదైన కారు కొన్నా.. అది నిలిపేందుకు పార్కింగ్ లేకపోతే ఓనరుకు కంటి మీద కునుకు లేనట్టే. రోడ్డుపై వాహనం నిలిపితే ఏదైనా డ్యామేజీ అవుతుందనే భయం వెంటాడుతుంటుంది. రోడ్డుపై కూడా స్థలం లేకపోతే పక్క కాలనీయో..లేదా ఇంకో కాలనీకి చెందిన ఖాళీ స్థలం వెతుక్కోవాల్సి వస్తుంది. అలా కూడా ఎక్కువ రోజులు పార్కింగ్ చేయలేని పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో కారు ఓనర్లకు.. పార్కింగ్ కష్టాలు తప్పడం లేదు. అలాంటి వారందరూ పార్కింగ్ స్థలం కోసం అన్వేషిస్తున్నారు.
ఈ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని చాలా మంది అపార్ట్మెంట్ వాసులు ఖాళీగా ఉన్న పార్కింగ్ సదుపాయాన్ని విక్రయిస్తున్నారు. నెలకు రూ.12 వందల నుంచి 2000 వరకు చార్జి చేస్తున్నారు. పార్కింగ్ సదుపాయం కోసం కారు ఓనర్లు ఇంకొంత ఎక్కువైనా పర్లేదు కానీ, పార్కింగ్ మాత్రం తమకే ఇవ్వాలంటూ పోటీపడుతుండటం విశేషం. నగరంలో పార్కింగ్ కష్టాలు ఎక్కువగా ఉండటంతో ఇంటి ఓనర్లు ‘పార్కింగ్ అవైలేబుల్’ అనే బోర్డులను సైతం ఇంటి గేటు ముందు ఏర్పాటు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కొత్తగా కారు కొనాలనుకునేవాళ్లు ముందుగా పార్కింగ్ స్థలం సమకూర్చుకోవడంపై దృష్టి సారించడం విశేషం.
స్టేటస్ సింబల్‌గా..!
కారు ఇప్పుడు ప్రతి ఒక్కరికి స్టేటస్ సింబల్‌గా మారిపోయింది. అవసరమున్నా.. లేకున్నా.. కారు ఉండాల్సిందేనని చాలా మంది భావిస్తున్నారు. కొందరు తమ విధుల్లో భాగంగా కొనుగోలు చేస్తుంటే.. మరికొందరు ఫ్యామిలీ ట్రిప్పుల కోసం వినియోగించుకోవాలని ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. ఇంకొందరు కారు ఉంటే చాలన్నట్టు గౌరవం కోసం కొనుగోలు చేస్తున్నారు. మధ్యతరగతి, ఎగువ మధ్య తరగతి వర్గాలకు అత్యంత అవసరంగా మారింది. కార్ల విక్రయాలకు నగరం చిరునామాగా మారుతుంది. వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ దిగ్గజాలకు కేంద్రమైన నగరంలో ప్రతి ఏడాది కార్ల విక్రయాలు భారీగా పెరుగుతున్నాయి.
కొత్త కాైర్లెతే.. కనీసం రూ.15 లక్షల నుంచి 9 కోట్లకు పైగా అమ్ముడుపోతుంటే.. పాత కార్లు ఇక అతి తక్కువ బడ్జెట్లో అందుబాటులో లభిస్తున్నాయి. గత ఏడాది కొత్త కార్లు గ్రేటర్లో సుమారు 5,798 కార్లు అమ్ముడుపోగా, సెకెండ్ హ్యాండ్ కార్ల అమ్మకాలు కూడా 70 శాతం పెరిగాయని నిర్వాహకులు చెబుతున్నారు. ఇలా రోజురోజుకు కార్ల కొనుగోళ్లు నగరంలో విరివిగా పెరుగుతున్నాయి. మార్కెట్లో కూడా సెకండ్ హ్యాండ్ కార్ల కొనుగోళ్లు జోరందుకుంటున్నాయి. వాటి సేల్స్ కోసం నగరంలో విరివిగా షోరూంలు కూడా వెలుస్తున్నాయి.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MVSR College | హైదరాబాద్ ఎంవీఎస్ఆర్ కాలేజీ దుర్ఘటన.. విద్యార్థిని మృతి కేసులో ముగ్గురు అరెస్ట్
Rahul Gandhi | రాహుల్ గాంధీ అమెరికన్ ఎత్తుగడలు.. సీజేపీపై ఆయన వ్యూహం ఎందుకు ఫలించడం లేదు!
Vegetable Nutrition | కూరగాయలు తింటున్నా పోషకాలు అందడం లేదా? ఈ వంటింటి చిట్కాలు తెలుసుకోండి!
Section 22A | సెక్షన్ 22ఏ జాబితా నుంచి తొలగించినా.. ఆస్తులు కొనేందుకు వెనుకడుగు వేస్తున్న ప్రజలు!
India vs Zimbabwe | హర్మన్‌ప్రీత్ విధ్వంసం.. షఫాలీ సునామీ.. జింబాబ్వే సిరీస్ క్లీన్‌స్వీప్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

