అల్వాల్, మే 18: ప్రియుడితో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని కూతురిని తల్లే హత్య చేసిన ఘటన అల్వాల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. మచ్చబొల్లారం డివిజన్ అంబేద్కర్‌నగర్‌కు చెందిన తన్విక (6) తల్లి రేఖకు ప్రియుడితో వివాహేతర సంబంధం ఉంది.
కూతురు అడ్డుగా ఉందని భవించిన తల్లి వాటర్ ట్యాంక్‌లోకి నెట్టి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమర్టానికి తరలించారు. నిందితురాలిని అదుపులోకి తీసుకొని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.