అందరి సహకారంతో బోనాలు విజయవంతంగా నిర్వహించుకుంటున్నాం : ఎమ్మెల్యే తలసాని
అందరి సహకారం, కృషి తో మహంకాళి అమ్మవారి బోనాల జాతర వైభవంగా నిర్వహించుకున్నామని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
MLA Talasani | అందరి సహకారం, కృషి తో మహంకాళి అమ్మవారి బోనాల జాతర వైభవంగా నిర్వహించుకున్నామని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం ఆయన మహంకాళి అమ్మవారి ఆలయం వద్ద బోనాల జాతర సందర్భంగా సేవలు అందించిన పలు శాఖల అధికారులు, వాలంటీర్లను శాలువాతో సత్కరించి డెక్కన్ మానవ సేవా సమితి శతాబ్ది ఉత్సవాల జ్ఞాపికలను అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారి దర్శనం కోసం, బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకునేందుకు వచ్చిన భక్తులకు ఏర్పాట్లు చేయడంలో కృషి చేసిన వివిధ శాఖల అధికారులు, భక్తులకు సేవలు అందించిన వాలంటీర్లు, రెండు రోజుల పాటు ఆలయం వద్దే ఉండి తమ మాధ్యమాల ద్వారా కవరేజ్ చేసిన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు అభినందనలు తెలిపారు.
కార్యక్రమంలో డెక్కన్ మానవ సేవా సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ అత్తిలి మల్లిఖార్జున్ గౌడ్, నాయకులు కొండాపురం మహేష్ కుమార్ యాదవ్, కిషోర్, ఆనంద్ పాటిల్, రాం మోహన్ యాదవ్, అరుణ్ భట్, జయరాజ్, సత్యనారాయణ, చంద్ర ప్రకాష్ శర్మ, సమితి సభ్యులు కమల్ కుమార్, నర్సింగ రావు, హరిబాబు యాదవ్, రఘుమోహన్, నాయుడు, శశాంక్, అనురాగ్ తదితరులు ఉన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

