హైదరాబాద్ : బంగారు భవిష్యత్తుకు విద్య ఎంతో ప్రధానమైందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం రాంగోపాల్ పేట డివిజన్ హైదర్ బస్తీలో గల హిందీ మహా విద్యాలయంలో తెలంగాణ పేపర్ మర్చంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 160 మంది విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచి విద్యా బోధన జరగాలంటే అన్ని సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు.
పేద విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ చేసే గొప్ప కార్యక్రమం చేపట్టిన తెలంగాణ పేపర్ మర్చంట్స్ అసోసియేషన్ సభ్యులను అభినందించారు. విద్యార్థులు మంచిగా చదువుకోవాలని, ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకొస్తే పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని ప్రకటించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు అత్తిలి మల్లిఖార్జున్ గౌడ్, అత్తిలి అరుణ గౌడ్, అసోసియేషన్ ప్రతినిధులు అభిషేక్ విజయ్, శ్రీనాధ్, మాశెట్టి శ్రీనివాస్, విజయ్, డివిజన్ బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, నాయకులు కిషోర్, ఆంజనేయులు, నార్ల దీపక్ గుప్తా, కోటేశ్వర్ గౌడ్, గణేష్, అభిషేక్, జనార్దన్, రాజు తదితరులు ఉన్నారు.