ఇంద్రారెడ్డి ఆశయ సాధనకు కృషి చేయాలి
ఇంద్రారెడ్డి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి అన్నారు. సోమవారం ఇంద్రారెడ్డి వర్ధంతిని పురస్కరించుకొని చేవెళ్ల పట్టణంలోని అయన విగ్రహానికి, కౌకుంట్లలోని సమాధి వద్ద ఆమె పూలమాలలు వేసి నివాళులర్పించారు.
- మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి
చేవెళ్లటౌన్, ఏప్రిల్ 22 : ఇంద్రారెడ్డి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి అన్నారు. సోమవారం ఇంద్రారెడ్డి వర్ధంతిని పురస్కరించుకొని చేవెళ్ల పట్టణంలోని అయన విగ్రహానికి, కౌకుంట్లలోని సమాధి వద్ద ఆమె పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇంద్రారెడ్డి కుమారులు కార్తిక్‌రెడ్డి, కౌశిక్‌రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య, రంగారెడ్డి డీసీఎంఎస్ చైర్మన్ కృష్ణారెడ్డి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా సబితారెడ్డి మాట్లాడుతూ ఇంద్రారెడ్డి అందరినుంచి దూరమై 23 ఏండ్లు కావొస్తున్నా ఇంకా ప్రజల గుండెల్లో ఉన్నారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇంద్రన్న కల, రాష్ట్రం ఏర్పడి మాజీ సీఎం కేసీఆర్ నేతృత్వంలో సుపరిపాలన కొనసాగిందన్నారు. ఇంద్రన్న అడుగుజాడల్లో నడుస్తూ ఆయన అశయ సాధనకు కృషి చేస్తామన్నారు.
కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బాల్‌రాజ్, మాజీ వైస్ ఎంపీపీ ప్రసాద్, మండల అధ్యక్షుడు ప్రభాకర్, చేవెళ్ల మండల సర్పంచ్ల సంఘం మాజీ మండల అధ్యక్షుడు శేరి శివారెడ్డి, మాజీ సర్పంచ్‌లు నరహరిరెడ్డి, మల్లారెడ్డి, మోహన్‌రెడ్డి, ప్రభాకర్, ఎంపీటీసీ సత్యనారాయణచారి, శంకర్పల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పాపారావు, చేవెళ్ల మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్లు గిరిధర్‌రెడ్డి, నర్సింహులు, డైరెక్టర్లు వెంకటేశ్, మహేశ్, సాయినాథ్, గుడిమల్కాపూర్ డైరెక్టర్లు మంగలి యాదగిరి, నాయకులు మహేందర్, శేఖర్‌రెడ్డి, చింటు, శ్రీకాంత్, రాఘవేందర్ఎడ్డి, చందు, ఎల్లయ్య, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

