భూములు అమ్ముకుంటున్న కాంగ్రెస్
కూకట్‌పల్లిలో బీఆర్ఎస్ పాలనలో రెండువేల కోట్ల విలువైన స్థలాలను ప్రజా ప్రయోజనాల కోసం కేటాయిస్తే.. కాంగ్రెస్ మూడేండ్ల పాలనలో రెండువేల కోట్ల విలువైన భూములను అమ్ముకున్నదని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.
- ప్రజా అవసరాలకు కేటాయించిన స్థలాల విక్రయంపై బీఆర్ఎస్ ఆగ్రహం
కూకట్‌పల్లిలో బీఆర్ఎస్ పాలనలో రెండువేల కోట్ల విలువైన స్థలాలను ప్రజా ప్రయోజనాల కోసం కేటాయిస్తే.. కాంగ్రెస్ మూడేండ్ల పాలనలో రెండువేల కోట్ల విలువైన భూములను అమ్ముకున్నదని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. కేపీహెచ్‌బీ కాలనీలో ప్రజా అవసరాల కోసం కేటాయించిన స్థలాన్ని అమ్మకానికి పెట్టడం సిగ్గుచేటన్నారు.
కూకట్‌పల్లిలో హెచ్ఎండీఏ స్థలాన్ని, కేపీహెచ్‌బీ కాలనీలో హౌసింగ్ బోర్డ్ స్థలాలను వేలానికి పెట్టడాన్ని నిరసిస్తూ.. శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..బీఆర్ఎస్ పాలనలో కేపీహెచ్‌బీ కాలనీలో సుమారు 50 ఎకరాల హౌసింగ్ బోర్డు స్థలాలను ప్రజలకు అంకితం చేసి, మహిళా, చిన్నారుల పార్కులు, క్రీడా ప్రాంగణాలు, ఇండోర్స్టేడియాలను అందుబాటులోకి తెచ్చామన్నారు.
కేపీహెచ్‌బీ కాలనీ, నవంబర్ 6: నాడు కూకట్‌పల్లిలో నెక్సెస్ మాల్ వెనుకాల 20 ఎకరాల స్థలాన్ని మేము కాపాడితే.. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ స్థలంలో ఇందిరమ్మ ఇండ్లకు శంకుస్థాపన చేసిందన్నారు. కాంగ్రెస్ పాలనలో హౌసింగ్ బోర్డులో 4,5 గజాల స్థలాలను కూడా వదలకుండా అమ్ముకుంటున్నారన్నారు. కేపీహెచ్‌బీ కాలనీలో ఫైర్ స్టేషన్ కోసం కేటాయించిన స్థలాన్ని విక్రయించారని, తాజాగా పెట్రోల్ బంక్కోసం వదలిన స్థలాన్ని వేలానికి పెట్టినట్లు చెప్పారు.
ప్రజా అవసరాలకు కేటాయించిన స్థలాలను విక్రయిస్తే.. భవిష్యత్ తరాలకు కావాల్సిన మౌలిక వసతులను ఎలా కల్పిస్తారని ప్రశ్నించారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద కాలనీగా గుర్తింపు పొందిన కేపీహెచ్‌బీ కాలనీలో పెట్రోల్ బంక్, ఫైర్స్టేషన్లు లేవని, వాటికి కేటాయించిన స్థలాలను అమ్మితే ఎలా అని ప్రశ్నించారు. కేపీహెచ్‌బీ కాలనీలో హెచ్ఎండీఏ అనుమతులు లేకుండా స్థలాలను అమ్మడం సరికాదని, కొనుగోలు చేసిన వారు ఇబ్బందులు పడుతున్నారన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, హౌసింగ్ బోర్డు వీసీ గౌతమ్‌లు తీరు మార్చుకుని స్థలాలను విక్రయించడంమానుకోవాలని కోరారు.
కాంగ్రెస్ పాలన కూకట్‌పల్లికి శాపం
కాంగ్రెస్ పాలన కూకట్‌పల్లికి శాపంగా మారిందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు విమర్శించారు. గతంలో టీడీపీ, బీఆర్ఎస్ పాలనలో కూకట్‌పల్లిలో స్థలాలను అమ్మలేదని, గతంలో కాంగ్రెస్ పాలకులే భూములను అమ్మారని, నేడు మళ్లీ భూములను అమ్ముకుంటున్నారన్నారు. కూకట్‌పల్లిలో ప్రజల నుంచి 30 ఎకరాల స్థలాన్ని సర్కార్ సేకరించి, ట్రక్ పార్కింగ్‌కు కేటాయించిందని, నేడు హెచ్ఎండీఏ అధీనంలో ఉన్నా 3.15 ఎకరాల స్థలాన్ని అమ్మకానికి పెట్టిందని, ఈ స్థలాన్ని క్రికెట్ క్రీడాప్రాంగణంగా తీర్చిదిద్దాలని కోరినా పట్టించుకోవడం లేదన్నారు.
ఇప్పటికే కేపీహెచ్‌బీ కాలనీ వసంతనగర్‌లో 22ఏ తో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, దీనిపై పోరాటాలు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. కేపీహెచ్‌బీ కాలనీ 3వ ఫేజ్‌లో ప్రభుత్వం పాఠశాల నిర్మాణం కోసం పనులు చేపట్టేందుకు పాలకులు అనుమతులు ఇవ్వడం లేదన్నారు. మియాపూర్‌లో 400 ఎకరాల స్థలాన్ని బీఆర్ఎస్ కాపాడితే… ఇంకా కోర్టు తీర్పు పత్రాలు రాకుండానే అమ్మకానికి పెట్టడం బాధాకరమన్నారు.
కాళేశ్వరం నుంచి నీటిని తీసుకోకపోవడంతో రానున్న రోజుల్లో నీటి కష్టాలు పెరుగుతాయన్నారు. ఇప్పటికే ప్రైవేట్ హాస్టళ్లలో నీళ్లులేక…. విద్యార్థులు, ఉద్యోగులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. 12 వేలకు నీటి ట్యాంకర్లు అమ్ముతున్నారని, నిత్యావసర ధరలు అమాంతం పెరిగాయన్నారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు మందడి శ్రీనివాస్‌రావు, బాబురావు, తూము శ్రావణ్‌కుమార్, రవీందర్‌రెడ్డి, ముద్దం నర్సింహాయాదవ్, సబిహాబేగం, పండాల సతీశ్‌గౌడ్ పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

