స్వీయ నియంత్రణే శ్రీరామరక్ష

కేపీహెచ్‌బీ కాలనీ, ఏప్రిల్ 29 : కరోనా కట్టడికి స్వీయ నియంత్రణే శ్రీరామరక్షయని కూకట్పల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. గురువారం కేపీహెచ్‌బీ కాలనీ 9వ ఫేజ్‌లో, బాలాజీనగర్ డివిజన్లోని సేవాలాల్నగర్లో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్వయంగా సోడియం హైపోక్లోరైట్ ద్రావణాలను పిచికారీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణారావు మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మాస్కులు ధరిస్తూ భౌతికదూరాన్ని పాటించాలన్నారు. అత్యవసరమైతేనే ఇంటినుంచి బయటికి రావాలని కోరారు. పౌష్టికాహారం తీసుకుని మనోధైర్యంతో జీవించాలని కోరారు. కరోనాను నియంత్రించడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలలో ఉచితంగా కరోనా పరీక్షలు చేయడంతో పాటు కరోనా వ్యాక్సిన్ కూడావేస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరారు. అదేవిధంగా జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రభుత్వ భవనాలు, ఫంక్షన్‌హాళ్లలో ఐసోలేషన్ కేంద్రాలుగా మార్చేందుకు చర్యలు తీసుకుంటుందని తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్ మందడి శ్రీనివాస్‌రావు, మాజీ కార్పొరేటర్ పగడాల బాబూరావు, మూసాపేట సర్కిల్ ఉప కమిషనర్ కె.రవికుమార్, ఎంటమాలజీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cyclone Arnab | అర్నాబ్ తుపాను ఎఫెక్ట్.. పాపికొండలు విహారయాత్రకు బ్రేక్..!
MLA Anirudh Reddy | నేను చచ్చిపోతా.. ఆ తర్వాత నిధులు ఇయ్యండి : కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Modi Ka Baap Bhi Jayega: ఖర్గే క్షమాపణ చెప్పాల్సిందే.. దేశవ్యాప్తంగా దిష్టిబొమ్మలు దహనం
Invited for Bihu, then attacked | పూజా కార్యక్రమానికి ఆహ్వానించి.. బిహు కళాకారులపై దాడి
Womens Health | వయస్సు మళ్లుతున్న మహిళల్లో ఈ లక్షణాలు కనిపిస్తుంటే.. జాగ్రత్త పడాల్సిందే..
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

