అభివృద్ధి పనులకు స్థలమివ్వండి

ఎల్బీనగర్, జూలై 19 : ఎల్బీనగర్ నియోజకవర్గంలోని రెవెన్యూ సమస్యలను పరిష్కారం చేయాలని కోరుతూ హైదరాబాద్ కలెక్టర్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఇన్చార్జి కలెక్టర్ శ్వేతా మహంతిని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి సోమవారం కలిసి విన్నవించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాగోలు డివిజన్ ఫతుల్లగూడలోని సర్వే నంబర్.58లోని రెండు ఎకరాల స్థలంలో ఒక ఎకరంలో ప్లే గ్రౌండ్, మరో ఎకరం స్థలంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఏర్పాటు చేయాలని, నాగోలు బండ్లగూడలోని సర్వే నంబర్ 36/6లో ఉన్న ఎకరం స్థలంలో నూతన పోలీస్‌స్టేషన్ నిర్మాణం కోసం కేటాయించాలని, నాగోలు సర్వే నంబర్.91 అరుణోదయకాలనీలోని 884 గజాల స్థలంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం, కొత్తపేట సర్వే నంబర్.143 శ్రీరామలింగేశ్వర కాలనీలోని 2500 గజాల స్థలంలో పార్కును నిర్మించేందుకు కేటాయించాలని కలెక్టర్ శ్వేతా మహంతిని కోరారు. అదే విధంగా మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లతో సంయుక్త సమావేశం ఏర్పాటు చేసి నందనవనం జేఎన్ఎన్యూఆర్ఎం ఇండ్ల వివాదాన్ని పరిష్కరించాలని కోరారు. ఇందుకు స్పందించిన కలెక్టర్ శ్వేతా మహంతి ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ప్రతిపాదించిన విధంగా పనులు ప్రారంభమయ్యేలా చూస్తామంటూ ఎమ్మెల్యేకు హామీ ఇచ్చారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

