సురవరం సేవలు చిరస్మరణీయం

రవీంద్రభారతి, సెప్టెంబర్ 12: నిజాం కాలంలో తెలంగాణను మేల్కొల్పిన గొప్ప వైతాళికుడు సురవరం ప్రతాప్‌రెడ్డి అని, ఆయన సేవలు చిరస్మరణీయమని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి నాందిపలికన మహనీయుడని కొనియాడారు. ప్రజాకవి కాళోజీ జయంతి సందర్భంగా వనపర్తి సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం రవీంద్రభారతిలో ‘సురవరం తెలంగాణ ’ 2వ సంపుటి పుస్తకాన్ని ఆచార్య ఎల్లూరి శివారెడ్డి ఆవిష్కరించారు. ఈ సభకు అధ్యక్షత వహించిన మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. సురవరం గొప్ప సాహితీవేత్తే కాకుండా గొప్ప సాంఘిక, రాజకీయవేత్త అని పేర్కొన్నారు. ఆయన వనపర్తి ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో సాంఘిక అసమానతలపై దళిత దండోరా మోగించి, సంహపక్తి భోజనాలు ఏర్పాటుచేశారని గుర్తుచేశారు. నేటి యువతరం ప్రతాప్‌రెడ్డిని స్ఫూర్తిగా తీసుకుని తెలుగును, తెలగుభాషను కాపాడుకోవాలని బీసీ సంక్షేమశాఖ కమిషనర్ బుర్రా వెంకటేశం పేర్కొన్నారు. సురవరం పాలమూరు జిల్లాలో జన్మించడం తమ అదృష్టంగా భావిస్తున్నట్టు ఎమ్మెల్సీ గోరటి వెంకన్న పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌రెడ్డి పలువురు కవులు, కళాకారులకు శాలువా కప్పి, సన్మానించారు. కార్యక్రమంలో సీఎంవో ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, తెలంగాణ సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mouli | న్యూస్ ఛానెల్ వాళ్లు బ్లాక్మెయిల్ చేశారు.. అనారోగ్యంతో ఉన్నా వెళ్లక తప్పలేదు: మౌళి
NZvIND: టాస్ గెలిచిన ఇండియా.. న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్
Ranabaali | మిక్స్డ్ టాక్‌ను తట్టుకుని దూసుకుపోతున్న ‘రణబాలి’.. బ్రేక్ఈవెన్ దిశగా అడుగులు!
Vice President | ఏపీలో 26,27వ తేదీల్లో ఉప రాష్ట్రపతి పర్యటన
RS Praveen Kumar | మేడిగడ్డపై ఫిర్యాదు చేసి మూడేండ్లు గడిచినా పట్టించుకోవడం లేదు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

