తెలంగాణ సంస్కృతికి ప్రతీక బోనాలు
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయ ప్రతీక బోనాలు అని కార్మి క శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. బోడుప్పల్ కార్పొరేషన్, పోచారం, ఘట్కేసర్ మున్సిపాలిటీల్లో ,జవహర్‌నగర్‌లో ఆదివారం జరిగిన బోనాల పండుగలో మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు.
- నియోజకవర్గంలో ఘనంగా బోనాల పండుగ
- పలు చోట్ల అమ్మవారికి మంత్రి పూజలు
- అమ్మవారి ఆలయాల్లో భక్తుల సందడి
- మొక్కులు చెల్లించుకున్న భక్తులు
బోడుప్పల్/ ఘట్కేసర్ / ఘట్కేసర్ రూరల్ : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయ ప్రతీక బోనాలు అని కార్మి క శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. బోడుప్పల్ కార్పొరేషన్, పోచారం, ఘట్కేసర్ మున్సిపాలిటీల్లో ,జవహర్‌నగర్‌లో ఆదివారం జరిగిన బోనాల పండుగలో మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. గ్రామ దేవతలకు మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. మంత్రిని నిర్వాహకులు ఘనం గా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలని ఆయన ప్రజలకు సూచించారు. నియోజకవర్గ ప్రజలను చల్లంగా చూడాలని అమ్మవారిని వేడుకున్నట్టు తెలిపారు.
బోడుప్పల్లో జరిగిన కార్యక్రమంలో మేయర్ సామల బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీరవిగౌడ్, పార్టీ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి, స్థానిక కార్పొరేటర్లు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. పోచారం, ఘట్కేసర్ మున్సిపాలిటీల్లోజరిగిన బోనాల ఉత్సవాల్లో మంత్రి మల్లారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. పోచారం మున్సిపాలిటీ నారపల్లిలో బొడ్రాయి ప్రతిష్ఠ అనంతరం ఆదివారం కట్ట మైసమ్మకు గ్రామస్తులు బోనాలు సమర్పించారు. చైర్పర్సన్లు పావనీ జంగయ్య యాదవ్, బి.కొండల్‌రెడ్డి, వైస్ చైర్మన్లు రెడ్డ్యానాయక్, మాధవ రెడ్డి, బీఆర్ఎస్ అధ్యక్షుడు సురేందర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు. మండల పరిధి మర్పల్లిగూడలో బోనాల పండుగ ఘనంగా జరిగింది. శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలతో బోనాలను ర్యాలీ గా తీసుకెళ్లి, అమ్మవారికి సమర్పించారు. సర్పంచ్ మంగమ్మ, పంచాయతీ సభ్యులు, నాయకులు, మహిళలు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Heavy traffic jam | హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్
Rashmika | విజయ్ దేవరకొండ ఇంకా నల్లపూసలు కొనివ్వలేదు.. రష్మిక మందన్న ఆసక్తికర వ్యాఖ్యలు!
Sambarala Yeti Gattu | ‘సంబరాల ఏటి గట్టు’ రిలీజ్ డేట్ వివాదం.. నిర్మాతకు ఫోన్ చేసి వార్నింగ్!
Ramayana | ‘రామాయణ’ను 3డీలోనే చూడండి.. ప్రేక్షకులకు సాయిపల్లవి ప్రత్యేక విజ్ఞప్తి!
Prabhas | ప్రభాస్ బర్త్‌డే స్పెషల్.. ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో అసలు కథ ఏంటో చెప్పనున్న టీమ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

