ప్రభుత్వ పరిశీలనలో క్రైస్తవుల శ్మశాన వాటిక

అమీర్‌పేట్, ఏప్రిల్ 2: దీర్ఘకాలంగా క్రైస్తవులు ఎదుర్కొంటున్న శ్మశానవాటిక అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. స్టర్ పర్వదినాన్ని పురస్కరించుకుని సనత్‌నగర్ బాప్టిస్ట్ చర్చి గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో భాగంగా జరిగిన ఈస్టర్ ప్రత్యేక ప్రార్థనలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రైస్తవుల శ్మశాన వాటిక అంశాన్ని సీఎం కేసీఆర్ పూర్తి సానుకూల దృక్పథంతో పరిశీలిస్తున్నారని, ఇటీవల సికింద్రాబాద్‌లో జరిగిన క్రైస్తవ ప్రముఖుల సమావేశంలో కూడా ఇదే సమస్య ప్రస్తావనకు వచ్చిందని, త్వరలోనే సమస్యకు పరిష్కారం లభిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. అన్ని మతాలకు చెందిన విశ్వాసాలను సముచితంగా గౌరవిస్తున్నది తెలంగాణ రాష్ట్రం ఒక్కటేనని పేర్కొన్నారు. కొవిడ్ నిబంధనలను పాటిస్తూ వేడుకలను నిర్వహిస్తున్న చర్చి ప్రతినిధులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి ఈటలను చర్చి ప్రతినిధులు జోసెఫ్ తదితరులు ఘనంగా సన్మానించారు.
మొబైల్ మెడికల్ వ్యాన్ ప్రారంభం…
ఆశ్రయం, హ్యాండ్ ఆఫ్ హోప్ ఆధ్వర్యంలో తీర్చిదిద్దిన మొబైల్ మెడికల్ వ్యాన్‌ను మంత్రి ఈటల ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేదలకు ఈ వ్యాన్ ద్వారా ఉచిత ల్యాబ్ సేవలు, ఎక్స్‌రే, సీబీపీ, ఈసీజీ, సెరమ్, ఆర్బీహెచ్ పరీక్షలు ఉచితంగా జరుపుతామని వ్యాన్ నిర్వాహకులు జవహర్ కెనెడీ మంత్రికి వివరించారు. ఆశ్రయం, హ్యాండ్ ఆఫ్ హోప్ ప్రతినిధులు గ్రామీణ ప్రాంతాల్లో అందిస్తున్న ఉచిత వైద్య సేవలు అపూర్వమైనవంటూ అభినందించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Religious Conversion | కేవలం పెండ్లి కోసం మత మార్పిడులను అంగీకరించలేం: బాంబే హైకోర్టు
Driving Licence | డ్రైవింగ్ లైసెన్స్‌కు 75 శాతం మార్కులు రావాల్సిందే!
Whatsapp | మీ ఫోన్లో సిమ్ లేకున్నా వాట్సాప్ వాడుతున్నారా? త్వరలో మారనున్న రూల్స్
Gang Rape | గర్భిణి బాలికపై గ్యాంగ్ రేప్.. దాడి సమయంలో ప్రసవం
82% జీవోలు రహస్యం.. కాంగ్రెస్ పాలనలో మితిమీరిన గోప్యత
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

