దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వస్త్తూ..
దైవ దర్శనానికి వెళ్లి, తిరిగి వస్తూ మినీ ట్రావెల్స్ బస్ బోల్తాపడి 15 మందికి గాయాలయ్యాడు. ఈ ఘటన మెదక్ జిల్లా నార్సింగి మండలం వల్లూర్ సమీపంలోని 44వ జాతీయ రహదారిపై బుధవారం ఉదయం చోటు చేసుకుంది.
- మినీ ట్రావెల్ బస్ బోల్తా.. 15 మందికి గాయాలు
చేగుంట, జూన్ 5: దైవ దర్శనానికి వెళ్లి, తిరిగి వస్తూ మినీ ట్రావెల్స్ బస్ బోల్తాపడి 15 మందికి గాయాలయ్యాడు. ఈ ఘటన మెదక్ జిల్లా నార్సింగి మండలం వల్లూర్ సమీపంలోని 44వ జాతీయ రహదారిపై బుధవారం ఉదయం చోటు చేసుకుంది. నార్సింగి పోలీసుల కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లా సత్తుపల్లి, హైదరాబాద్కు చెందిన 21 మంది యాత్రికులు గత నెల 24 తేదీన రైలులో కాశీకి వెళ్లి.. తిరుగు ప్రయాణమయ్యారు. తిరుగు ప్రయాణానికి రైలు టికెట్లు అందుబాటులో లేకపోవడంతో లక్నోలో ఓ మినీ ట్రావెల్స్ బస్సును మాట్లాడుకుని వారణాసిలోని కాశీ విశ్వనాథుడిని దర్శించుకొని తిరిగి బయలుదేరారు.
నార్సింగి మండలం వల్లూర్ సమీపంలోని జాతీయ రహదారిపై ప్రమాదవశాత్తు అదుపుతప్పి ట్రావెల్స్ బస్ బోల్తా పడింది. అందులో ప్రయాణిస్తున్న యాత్రికులు జ్యోతి, పూర్ణ, ఉమా, సుబ్రహ్మణ్యం, రాధిక, వెంకట్రెడ్డి, నిర్మల, రమణ సహా అందులో ప్రయాణిస్తున్న 21 మందికి గాను 15 మందికి గాయాలయ్యాయి. గాయపడిన క్షతగాత్రులను 108 వాహనంలో తూప్రాన్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. విషయం తెలుసుకున్న నార్సింగి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రోడ్డుపై బోల్తా పడిన బస్ను తొలగించి ట్రాఫిక్ను క్లియర్ చేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

